Union minister venkaiah naidu surprise checks

Venkaiah clarifies Center position, AP Telangana States problems, Venkaiah Naidu, Urban Development Minister Venkaiah

Union Minister Venkaiah Naidu surprise checks: Venkaiah asks states resolve problems

విశ్వరూపం చూపిస్తున్న వెంకయ్య!

Posted: 07/29/2014 11:00 AM IST
Union minister venkaiah naidu surprise checks

కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు తన విశ్వరూపం చూపిస్తున్నారు.  పార్లమెంటరీ వ్యవహారాలను, పట్టణాభివృద్ధి శాఖలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వెంకయ్యనాయుడు తన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి ఆలస్యంగా వచ్చి నిదానంగా పనులను ప్రారంభించేవారిని పట్టుకున్నారు.  ఉదయం 9.00 గంటలకి రావలసిన ఉద్యోగులు వెంకయ్య నాయుడు 9.15 కి వచ్చి చూసినా కనిపించకపోవటం, ఖాళీ కుర్చీలు వెక్కిరించటంతో ఆయన ఉద్యోగుల రాకకోసం ఎదురుచూసి, వాళ్ళు వచ్చిన తర్వాత సంజాయిషీ తీసుకున్నారు.  

ఈ పద్ధతి పునరావృతం కాకుండా ఉండటం కోసం వెంకయ్యనాయుడు అటెండెన్స్ రిజిస్టర్ ని ఉదయం 9.00 తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉంచవద్దన్న ఆదేశాలిచ్చి మరీ వెళ్ళారు.

తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చాలా నిక్కచ్చిగా మాట్లాడుతూ తెలుగువాడు కాబట్టి పక్షపాతం చూపించారనే మాట రాకుండా చూసుకుంటున్నారు.  మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలుంటే కూర్చుని మాట్లాడుకోండి, మీ నిధులను మీరే సమకూర్చుకోండి, తగవులతోను, నిధులవేటలోనూ కేంద్రాన్ని డిస్టర్బ్ చెయ్యకండన్న సంకేతాలను వెంకయ్య నాయుడు చాలా స్పష్టంగా ఇచ్చారు.  ఇరు రాష్ట్రాలలోని నాయకులు వాళ్ళు తమంతటగా ఇచ్చిన హామీలను (ఋణమాఫీ వగైరా) వాళ్ళే నెరవేర్చాలని, అందులో కేంద్రం ఇసుమంతైనా ఉండదని తేల్చి చెప్పేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles