Bashir ahmad goglu played a bomb game in mumbai police station

bashir ahmad goglu played a bomb game in mumbai police station, kashmir man bashir ahmad goglu, kashmir man bashir ahmab goglu played bomb game, kashmir man in pune bomb blast, kashmir man played bomb game with police, kashmir man bashir ahmad goglu played bomb game with police

kashmir man bashir ahmad goglu played a bomb game in mumbai police station to escape from debts

అప్పులను ఎగ్గొట్టేందుకు ‘‘బాంబ్’’ గేమ్ అడిన వ్యక్తి!

Posted: 07/28/2014 06:46 PM IST
Bashir ahmad goglu played a bomb game in mumbai police station

పీకల్లోతు వరకు అప్పులబాధల్లో మునిగిపోయిన ఓ యువకుడు... పోలీసులతో ఒక ‘‘బాంబ్’’ గేమ్ ఆడాడు. సాఫీగా పోలీస్ స్టేషన్ లో ఎంటర్ అయిన ఇతను.. అనుకోకుండా ఒక పెద్ద బాంబ్ పేల్చేశాడు. దాంతో సదరు పోలీస్ అధికారులు కూడా అవాక్కయిపోయారు. కానీ ఇతను పేల్చింది రియల్ బాంబ్ కాదులెండి.. మాటల బాంబు!

అసలు విషయం ఏమిటంటే.. కాశ్మీర్ కు చెందిన బషీర్ అహ్మద్ గోగ్లు అనే యువకుడు అప్పుడు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాటిని ఎగ్గొట్టేందుకు శ్రీనగర్ నుంచి నేరుగా ముంబయి చేరుకున్నాడు. తాను చేరుకున్న వెంటనే అక్కడున్న స్థానిక పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీసుల ఎదుట కొద్దిసేపటి వరకు నోరు మెదపకుండా అలాగే వుండిపోయాడు. ఆ తరువాత నోరు తెరిస్తే తెరిచాడు కానీ.. అతను చెప్పిన మాటలు విని పోలీసులంతా షాక్ కు గురయ్యారు.

‘‘నేను పుణే బాంబు పేలుళ్లకు పాల్పడ్డాను. మీ దర్యాప్తుకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను ఆ విషయం మీద ఇంటరాగేట్ చేయవచ్చు’’ అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. తనకు కావలిసినంత డబ్బు ఇస్తే.. సహకరిస్తానని తెలిపాడు. దీంతో ఈ విషయం ఏదో ఆసక్తికరంగా వుందంటూ పోలీసులు తమ స్టైల్లో ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. అప్పుడు అసలు సంగతి బయటపడింది.

కాశ్మీర్ లో శాలువాలు అమ్ముకుంటూ తన భార్యతో జీవనం కొనసాగిస్తున్న బషీర్.. అప్పుల బాధలు ఎక్కువ కావడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో తాను శ్రీనగర్ నుంచి ముంబయి వచ్చానని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు కొద్దిసేపు నవ్వుకుని, కాశ్మీర్ లో వున్న తన భార్యకు ఫోన్ చేసి తమ అదుపులో వున్నట్టు సమాచారం ఇచ్చారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles