Aidmk mp deputy speaker offer modi favors jayalalitha

aidmk mp m.thambi durai, deputy loksabha speaker aidmk mp, tn cm jayalalitha man dy loksabha speaker, jayalalitha preferred to sonia by modi

AIDMK MP Deputy Speaker offer Modi favors Jayalalitha: Modi preferred Jaya to Sonia giving Deputy Speaker position to M.Thambi Durai from AIDMK

కాంగ్రెస్ నీడ కూడా వద్దు ?

Posted: 07/28/2014 12:57 PM IST
Aidmk mp deputy speaker offer modi favors jayalalitha

కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండానే చెయ్యటానికి కంకణబద్ధులైన భాజపా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ మరీ ఇదిగా గీమాలుతున్నా ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇవ్వటానికి ససేమిరా అంటున్నారు.  దానికే గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు మోదీ.  

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ఏఐడిఎమ్ కే ఎంపీ తంబీదురైకి లోక్ సభ ఉప సభాపతి పదవిని కట్టబెడుతున్నారు.  ప్రతిపక్షానికే ఈ పదవిని ఇచ్చే ఆనవాయితీ ఉంది.  మోదీ ప్రభుత్వం దాన్నే పాటిస్తోంది.  ఎందుకంటే జయలలిత ఎన్డియే లో లేదు కాబట్టి.  అయితే ఏఐడిఎమ్ కె కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకున్న కాంగ్రెస్ ని విస్మరించి ఆ తర్వాత స్థానమైన జయలలిత పార్టీ మీద మొగ్గు చూపించటం కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదు.  

నిజానికి జయలలిత 2014 ఎన్నికలలో పశ్చిమ బెంగాల్, ఒడిశాలతో కలిసి పెద్ద కూటమినే మోదీకి వ్యతిరేకంగా తయారుచేద్దామని చూసారు.  కానీ మోదీ వేవ్ ముందు అవేమీ పనిచెయ్యలేదు. కలిసిన కూటమితో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను చేజిక్కించుకుందామనుకున్నారు కానీ కాంగ్రెస్ లాగా ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించలేదందులో.  ఆ పని చేసున్నా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షమే అయ్యుండేది కాబట్టి కూడా మోదీ జయలలిత పార్టీ అభ్యర్థి ఎమ్.తంబీ దురైకి ఆ అవకాశం ఇచ్చివుంటారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles