Aravind kejriwal take back step in assembly elections

aam aadmi party withdrawn from assembly elections, aravind kejriwal take back step in assembly elections, aravind kejriwal latest news, aravind kejriwal press meet, aravind kejriwal comments on congress party, aravind kejriwal aam aadmi party, assembly elections in haryana maharasthra and chattisgarh, delhi assembly eletions

aravind kejriwal take back step in assembly elections which are to be held in four states

ఎంత స్పీడుగా వచ్చారో.. అంతే వేగంతో చాప చుట్టేశారు!

Posted: 07/28/2014 12:22 PM IST
Aravind kejriwal take back step in assembly elections


దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలను సృష్టించి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ... ఎంత స్పీడుగా రంగంలోకి దిగిందో.. అంతే స్పీడుగా చాప చేట్టేసింది! మొన్నటి ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీని పట్టపగలే చుక్కలు చూపించిన ఆమ్ ఆద్మీ... ఇప్పుడు కనుమరుగయిపోయ్యాడు. మూడు పర్యాయాలు ఢిల్లీపీఠాన్ని అధిష్టించి, రికార్డులను నెలకొల్పిన నాటి సీఎం షీలా దీక్షింత్ ని కూడా భారీ మెజార్టీతో ఘోర పరాజయాన్ని రుచి చూపించిన ఆ పార్టీ.. ఇఫ్పుడు ఎక్కడ వెదుకుదామన్నా అస్సలు కనిపించడం లేదు!

ఎటువంటి రాజకీయ అనుభవంలేని కొత్త యువకులు ఆమ్ ఆద్మీలో వున్నప్పటికీ.. దేశ రాజకీయాల్లో ఓ ఊపు ఊపేసిన సీనియర్ నాయకులను సైతం ఓడించి, విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఇక ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ కూడా... తాను ఎన్నికల ప్రచారనేపథ్యంలో పేర్కొన్న హామీలను పూర్తి చేస్తూ విద్యుత్ ఛార్జీల తగ్గింపు, గృహాలకు నీటి కేటాయింపు వంటి తదితర నిర్ణయాలు తీసుకుని అసలైన రాజకీయ ‘‘నాయక్’’ అని పేరు సంపాదించుకున్నారు.

అప్పట్లో ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ’’ ప్రదర్శించిన దూకుడును ఢిల్లీ నగరవాసులు కూడా ఎంతో సంబరపడిపోయారు. ఇటువంటి నాయకుని ఇన్నాళ్లూ వేచి వున్నామంటూ కేజ్రీవాల్ ను ఆకాశానికి ఎగరవేశారు. దేశ రాజకీయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మమేకమైపోయారు. సీఎం అయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం నిద్రాహారాలు మాని ఉద్యమాలు చేసిన మొదటి సీఎంగా పేరు సంపాదించుకున్నారు. అతి తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన గౌరవం బహుశా దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అంతగా లభించి వుండదు.

అయితే ఈ సంతోషం ఎక్కువ రోజుల వరకు నిలవలేకపోయింది. ఢిల్లీ శాంతిభద్రతల అంశంపై యూపీఏ సర్కారుతో గొడవలకు దిగి అలజడులు సృష్టించారు. ఎలాగైనా ‘‘లోక్ పాల్’’ బిల్లును ఆమోదం పొందాలనే ఆవేశంతో అన్ని రాజకీయ పార్టీలతో ఆందోళనలకు దిగింది. సీఎం పీఠంపై కూర్చుని కూడా ఆందోళనలకు దిగి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు కేజ్రీవాల్! దీంతో ఈ నాయకుడి పేరు దేశవ్యాప్తంగా గంట మోగించి మరీ బజాయించారు. అంతలోనే సీఎం పదవికి రాజీనామా చేసి చేతులు కాల్చుకున్నారు.

తరువాత మోదీ మీద ఉగ్రరూపం దాల్చిన కేజ్రీవాల్.. ‘‘మోదీ పాలన గుజరాత్ అస్సలు బాగోలేదు... ఆయన మోసపూరిత ప్రచారాలు చేసుకుంటూ దేశప్రజలను మభ్య పెడుతున్నారంటూ’’ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వారణాసిలో మోడీపై పోటీకి కూడా దిగారు. తన పోరాట ప్రతిమను చాటుకుని అక్కడా సంచలనంగా మారిపోయారు. కానీ మోదీ ప్రభంజనం ముందు ఈ ఆమ్ ఆద్మీ నిలబడలేకపోయాడు. అక్కడ ఘోర పరాజయం కావడంతో తిరిగి యథాస్థితిగా ప్రచారాలు చేసుకుంటూ వుండిపోయాడు కేజ్రీవాల్!

ఇంతటి ప్రభంజనాన్ని చాటిచెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమయిందో ఏమో తెలియదు కానీ... తాజాగా తమ పార్టీ చాప చుట్టేస్తున్నామంటూ స్వయంగా కేజ్రీవాల్ ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇన్నాళ్లు పరుగు పందెంలో పాల్గొని విజయ కెరటాలను ఎగరేసిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడా కెరటాలను పక్కనపడేసి విశ్రాంతి తీసుకుంటోంది. కేజ్రీవాల్ తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇటు దేశప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను షాక్ కు గురిచేసింది.

తాజాగా దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను తెరలేవనుంది. ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగబోతోందని ఇదివరకే పార్టీ వర్గాలు కూడా పేర్కొన్నాయి. పార్టీకి బాగా పట్టువున్న హర్యానాతోపాటు ఛత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ర వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల బరిలోకి దిగనుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ రాష్ట్రాల ఎన్నికల బరిలోకి దిగడం లేదని చల్లగా వార్తలు చెబుతూ కుండబద్ధలు కొట్టేశారు.

కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆయన ఇటువంటి స్టేమ్ మెంట్ ఇస్తామని అందరూ ఊహించినప్పటికీ.. ఇంత డైరెక్ట్ గా ప్రకటించి అందరికీ షాక్ కి గురిచేస్తారని ఎవరూ అనుకోనుండరని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే పంజాబ్ లో జరగనున్న ఉపఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. పంజాబ్ లో కేవలం రెండు అసెంబ్లీలకు మాత్రమే ఉపెన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే!

దేశ రాజకీయాలను పూర్తి మార్చేసి, ప్రజల్లో నాయకుల మీద విశ్వాసం కలిగేలా శ్రమిస్తానని మాటిచ్చిన కేజ్రీవాల్... ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం మీద రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా పెదవి విరుస్తున్నారు. ఎంత స్పీడుగా రాజకీయాల్లో పరుగులు మొదలుపెట్టారో.. అంతే వేగంగా చాప చుట్టేస్తున్నారని కేజ్రీవాల్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్రీవాల్ ఇన్నాళ్లవరకు ప్రజల సంక్షేమం కోసం పరుగులు తీసి తీసి అలసపోయారని.. ఇప్పుడు ఆయన క్షేమం కోసం ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles