Kcr praises hyderabad metro rail project

Kcr praises hyderabad metro rail project , hyderabad metro rail creating new history in India, hyderabad metro rail project, telangana cm kcr latest news, telangana cm kcr press meet, cm kcr press meet, hyderabad metro rail project in renovation, metro rail project in hyderabad, kcr praises metro rail officials, bangalore metro rail project, delhi metro rail project, chennai metro rail project, mumbai metro rail project

Kcr praises hyderabad metro rail project for creating new history in India

హైదరాబాద్ ‘‘మెట్రో’’కి కేసీఆర్ అభినందనలు!

Posted: 07/28/2014 10:43 AM IST
Kcr praises hyderabad metro rail project

నిన్నమొన్నటివరకు హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును మార్చాల్సిందేనంటూ నిప్పులు చెరిగిన కేసీఆర్... ఇప్పుడు అదే మెట్రోకి అభినందనలు తెలుపుతున్నారు. ‘‘ఇదేంటి..? కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు..?’’ అని ఆరా తీస్తే... ఈ మెట్రో ప్రాజెక్ట్ భారత్ లోనే ఒక కొత్త రికార్డును సృష్టించింది. ఇంతవరకు ఏ మెట్రో ప్రాజెక్టు సంపాదించలేని ఘనతను ఇది సొంతం చేసుకుని, హైదరాబాద్ కు మరో ఘనతను సాధించిపెట్టింది.

ఈ ప్రాజెక్టుపై నిర్వహించిన కొన్ని సర్వేల ఆధారంగా తెలిసిందేమిటంటే... అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ మెట్రో రికార్డు స్థాయి నిర్మిణాలను చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ముంబైలో 11 కి.మీ. మెట్రో వయాడక్ట్ ను పూర్తి చేయడానికి 7 సంవత్సరాల కాలం పడితే... 25 కి.మీ. మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడానికి చెన్నైకి, బెంగుళూరుకి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది. ఇక ఢిల్లీ మెట్రోకు 3 సంవత్సరాల కాలం పట్టింది. కానీ వీటన్నింటినీ తలదన్నేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మాత్రం సంబంధించి 1000 వయాడక్ట్ ను పూర్తి చేయడానికి కేవలం 20 నెలలు మాత్రమే పట్టింది. అంటే 1 సంవత్సరం 8 నెలలు అన్నమాట!

ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంత భారీ నిర్మాణాలను చేపట్టడం కారణంగా హైదరాబాద్ మెట్రోకు భారతదేశంలో రికార్డుస్థాయి గౌరవం లభించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో అధికారుల్ని, ఎల్ అండ్ టీ సిబ్బందిని, హెచ్ఎంఆర్ ని అభినందించినట్లు మెట్రో వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘దటీజ్ హైదరాబాద్ మెట్రో’’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles