Amendments dowry prohibition act domestic violence act

Amendments Dowry Prohibition Act, Amendments Domestic Violence Act, Misuse Dowry prohibition Act, Misuse IPC 498 A

Amendments Dowry Prohibition Act Domestic Violence Act: Precautions not to misuse dowry prohibition act

వరకట్న నిషేధం అవసరమే కానీ....

Posted: 07/27/2014 05:52 PM IST
Amendments dowry prohibition act domestic violence act

వరకట్న నిషేధం అవసరమే, పుట్టి పెరిగిన ఇంటిని, వాతావరణాన్ని వదిలిపెట్టి మరో ఇంటికి వెళ్లే గృహిణుల పరిరక్షణా అవసరమే.  వరకట్న నిషేధాన్ని సమర్థవంతంగా అమలుపరచటం కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వరకట్న నిషేధ చట్టాన్ని ఇంకా పదును పెట్టే ప్రయత్నంలో ఉంది.  అలాగే కట్నం అంటే ఏమిటన్నదాన్ని కూడా విస్త్తత స్థాయిలో నిర్వచించే పనిలో పడింది.

misuse-498-aఅయితే వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి.  భారత శిక్షా స్మృతిలో సెక్షన్ 498 ఏ ప్రకారం వరకట్నం కోసం వేధిస్తున్న వారిమీద మహిళలు, వాళ్ళ తరఫువాళ్ళు ఫిర్యాదు చెయ్యవచ్చు.  ఈ సెక్షన్ ని దుర్వినియోగం చేసిన కేసులు సుప్రీం కోర్టు దృష్టికి కూడా వచ్చాయి.  దానితో, పోలీసులు అతిగా ప్రవర్తిస్తూ సెక్షన్ 498 ఏ కింద ఫిర్యాదు రాగానే చటుక్కున అరెస్ట్ లు చెయ్యవద్దని, వాటిన పరిశీలించి విచారించి చర్య తీసుకోమని చెప్పటం జరిగింది.  వేరే ఏదో కక్ష సాధించటం కోసం భర్తను, అత్తవారింట్లోవాళ్ళను వేధించటం లక్ష్యంగా వరకట్న నిషేధ చట్టాన్ని ఉపయోగించటం శోచనీయమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  

ఇంతవరకు వరకట్నమంటే వివాహసమయంలో వివాహం కోసం ఇచ్చే కట్నకానుకలుగా నిర్వచనమిచ్చారు కానీ దాన్ని మారుస్తూ, వివాహానికి ముందు కాని, వివాహ సమయంలో కాని, వివాహం తర్వాత కాని ఇచ్చే కట్నకానుకలు అని నిర్వచనమివ్వబోతున్నారు.  దానితో పాటు గృహహింస చట్టంలోని కొన్నిటిని వరకట్నానికి కూడా వర్తించేట్టు చేసే ప్రతిపాదనలున్నాయి.  

dowry

పెళ్ళిలో పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న కానుకలను ప్రకటించవలసిన అవసరం కూడా కల్పించబోతున్నారు.  అలా చెయ్యని పక్షంలో వాళ్ళని శిక్షార్హులుగా చట్టం చెప్పబోతోంది.  దానితో ఆ తరువాతి కాలంలో ఇవి వరకట్నానికి చెందినవి అని అనటానికి వీల్లేకుండా పోతుందని అధికారులు భావిస్తున్నారు.  2009 వరకట్న నిషేధ చట్టంలో మార్పులు తేవటం అవసరమని నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ కొన్ని సిఫారసులను కూడా చేస్తోంది.  

చట్టం కఠినంగానే ఉండాలి కానీ అమాయకులను బలితీసుకోగూడదు, చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వగూడదన్నది లక్ష్యంగా వరకట్న నిషేధ చట్టం రూపు దిద్దుకుంటోంది.

-శ్రీజ

Photo source - Misusing sec 498 a from Times of India

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles