Union minister venkaiah naidu blames congress for price rise

Venkaiah Naidu blames Congress for price rise, Union Minister Venkaiah Naidu, Parliamentary affairs minister Venkaiah Naidu

Union Minister Venkaiah Naidu blames Congress for price rise

తప్పంతా వాళ్ళదే వాళ్ళదే అంటున్న వెంకయ్య!

Posted: 07/27/2014 03:58 PM IST
Union minister venkaiah naidu blames congress for price rise

చేస్తే మా గొప్ప, చెయ్యలేనిదానికి తప్పంతా కాంగ్రెస్ ది.  ఇదీ భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యన నాయుడు చెప్తున్నది.  సామాన్యంగా ఏ రాజకీయ పార్టీయైనా అలాగే మాట్లాడుతుంది కానీ మోదీ ప్రభుత్వం నుంచి ప్రజలు కొంచెం భిన్నంగా, కొంచెం ఉన్నతంగా, కాస్త పారదర్శకంగా ఉంటుందని ఆశించారు.  

కాంగ్రెస్ పార్టీ ధరలను నియంత్రించలేకపోయిందన్న ఆరోపణతో ఎన్నికల ముందు భాజపా ప్రధనంగా ప్రజలలోకి వెళ్ళింది.  హైద్రాబాద్ లో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు, అదే కాంగ్రెస్ విధానం వలన ధరలింకా నియంత్రణలోకి రాలేదని చెప్పారు.  మేమొచ్చి 2 నెలలేగా అయింది అంటున్నారు వెంకయ్య నాయుడు.  వచ్చి 60 రోజులైందని కాంగ్రెస్ పార్టీ అంటోంది.  

కాంగ్రెస్ పార్టీ చేసిన మరో ఆరోపణ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించటానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదని, అందుకే మధ్యలో ఇంత గ్యాప్ వచ్చిందని.  అందుకు సమాధానంగా, పార్లమెంట్ లో ప్రవేశపెట్టటానికి మా దగ్గర ఎన్నో బిల్లులున్నాయి.  ఇన్సూరెన్స్, సెబి, జ్యుడిషయల్ అప్పాయింట్ మెంట్స్ లాంటి బిల్లులు తయారుగా ఉన్నాయన్నారు వెంకయ్య నాయుడు.  

బ్రిక్స్ మీటింగ్ లో జరిగింది పార్లమెంట్ ల వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.  కానీ అన్నిసార్లు బ్రిక్స్ మీటింగ్ కి వెళ్ళిన మన్సోహన్ సింగ్ ఏనాడూ ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించలేదని వెంకయ్య గుర్తుచేసారు.  

కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదాను నిరాకరించినందుకు స్పీకర్ సుమిత్రా మహాజాన్ ని, అడ్వకేట్ జనరల్ ని నిందిస్తున్నారని, కానీ యుపిఏ ప్రభుత్వంలో కూడా వాళ్లు పాటించిన నియమం అదే కదా అని అన్నారు వెంకయ్య నాయుడు.  నెహ్రూ రాజీవ్ గాంధీల సమయంలో ఏం చేసారన్నది కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే ఎలా అన్నారు వెంకయ్య.

ఇలా మీడియాలో కాంగ్రెస్ అన్నమాటలకు మీడియాలో భాజపా సమాధానం చెప్తోంది- పార్లమెంట్ లో ఒకరితో మరొకరు నేరుగా మాట్లాడుకోకుండా స్పీకర్ ని ఉద్దేశించే మాట్లాడినట్లుగా.  

మహాభారతమంతా కౌరవులు, పాండవుల మధ్య జరిగిన ఉదంతమే.  అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అంతా కాంగ్రెస్ భాజపా లమధ్య యుద్ధమే, ప్రజలంతా నిమిత్తమాత్రులన్నట్లుగా ఉంది.    

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles