Ri act all temples management in ap state

RI Act to Temples, Influential persons behind temple management, politically strong run temples, TTD income 2300 crore

RI Act all temples management in AP state proposed by Minister Manikyala Rao accepted by CM

రాజకీయాలు తప్పించుకోవటం దేవుడికీ సాధ్యం కాదు!

Posted: 07/27/2014 09:46 AM IST
Ri act all temples management in ap state

రోడ్డు పక్కనుండే చిన్న గుడి దగ్గర్నుంచి కోట్లలో ఆదాయమున్న పెద్ద పెద్ద ఆలయాలను తీసుకున్నా, ప్రతి దానిలోనూ మేనేజ్ మెంట్ కమిటీలో పెద్ద పెద్ద ఆసాములే ఉంటారు.  డబ్బున్నవారు, రాజకీయాలలో పలుకుబడివున్నవారు దాని వెనకాల ఉండటం జరుగుతుంది.  అందుకే గుడి గోపురాల వ్యవహారాలలో ప్రభుత్వం తలదూర్చటం జరగదు.  దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి వచ్చే గుడులలోనూ అదే తంతు.  తిరుపతి, శ్రీశైలంలాంటి పెద్ద పెద్ద ఆలయాల వెనుకనైతే మరీ బడా బడా నేతలే ఉండటంతో వాటిలో ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఏమైనా మార్పులు తీసుకునివద్దామన్నా వీలుపడని పరిస్థితి.  ఏమైనా అంటే పండితులచేత ఆగమ శాస్త్రానుసారం నడిపిస్తున్నాం అంటారు. ఎంత ఆదాయం వచ్చింది, దాన్ని దేనికి ఎందుకు కేటాయిస్తున్నారన్నదాన్ని చూడటానికి మేనేజ్ మెంట్ ఉన్నా, వాటికి ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను దేవాదాయ శాఖే నియమించినా వెనకనున్న బడా నేతల వలన అక్కడ పనులన్నీ యధావిధిగా సాగాల్సిందే కానీ ఎవరూ ఏమీ అడగటానికి ఉండదు.  

దీన్ని అధిగమించాలంటే సమాచార హక్కు చట్టాన్ని వాటిలోనూ వర్తింపజేయాలి.  ఈ సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు ప్రస్తావిస్తూ దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళనని, ఆయనా సానుకూలంగా స్పందించారని అన్నారు.  

పోయిన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం 2300 కోట్ల రూపాయలు.  అదంత ప్రజల సొమ్మే.  ఆలయాలకు చెందిన నిధులు, భూములు దుర్వినియోగమవటాన్నిఅడ్డుకోవాలంటే మాణిక్యాలరావు ప్రతిపాదించినట్లుగా స.హ.చట్టాన్ని వర్తించేట్టుగా చెయ్యాలి.   అయితే ప్రతిపాదన చేస్తూనే పలుకుబడిగలవారు కమిటీలో ఉంటారు కనుక దాన్ని అమలు చెయ్యటం కష్టమని కూడా ఆయనే అంటున్నారు.  

రాష్ట్రంలో ఉన్న 23000 ఆలయాలకు సహ చట్టాన్ని వర్తింపజేయటంతో అన్యాక్రాంతమైపోతున్న ఆలయాల ఆస్తులను పరిరక్షించటానికి వీలవుతుందని మాణిక్యాలరావు అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles