Telangana minister k tarakarama rao addresses corporate sector

Telangana Minister KTR, K Tarakarama Rao TRS, KTR advises Corporate sector, Companies to serve society as well

Telangana Minister K Tarakarama Rao addresses Corporate Sector suggests help society

సొంతలాభం కొంత మానుకు- కెటిఆర్!

Posted: 07/26/2014 05:08 PM IST
Telangana minister k tarakarama rao addresses corporate sector

గురజాడ అప్పారావు రచించిన "దేశమును ప్రేమించుమన్న" అన్న పాటలో "సొంత లాభము కొంత మానుకు.. పొరుగువాడికి తోడుపడవోయ్" అంటాడు.  కార్పొరేట్ సంస్థలు కూడా ఎంతసేపు లాభార్జన కోసమే కాకుండా వ్యాపారం కోసం అవకాశమిస్తున్న సమాజానికి కూడా కొంత భాగాన్ని తిరిగి ఇవ్వటం అవసరమే.  సామాజిక సంస్థలు- సామాజిక బాధ్యత అనే అంశం మీద ప్యాఫ్సీ భవన్ లో నిర్వహించిన సెమినార్ లో తెలంగాణా రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కె తారాక రామారావు మాట్లాడుతూ అదే విషయాన్ని సూచించారు.

అనేక మంది దేశంలో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నందున కార్పొరేట్ సంస్థలు వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చిన కెటిఆర్ పేదలు, ధనికుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే దిశగా సంస్థలు పాటుపడాలని కోరారు.  ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు చేరని ప్రాంతాలలో దృష్టి సారించాలని కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు కెటిఆర్ సూచించారు.   

ఈ సందర్భంలో టర్నోవర్ 1000 కోట్ల రూపాయలు దాటినా లేక ఆదాయం 5 కోట్ల రూపాయలు దాటినా అటువంటి సంస్థలు తప్పనిసరిగా 2 శాతం ఆదాయాన్ని సమాజసేవ కోసం ఉపయోగించాలన్నది చట్టం నిర్దుష్టంగా ఉన్నదన్న విషయాన్ని కెటిఆర్ గుర్తుచేసారు.  

వ్యాపారం కూడా సమాజ సేవే నిజానికి.  వ్యాపారమన్నదే లేకపోతే సమాజం, దేశం ముందుకు పోవటమనేది ఉండదు.  ఆ వ్యాపారాన్ని కొనసాగించాలంటే వ్యాపారికి తగినంత లాభం చేకూరటం కూడా అవసరమే.  అయితే లాభాలు పెరిగినప్పుడు వ్యాపారం చెయ్యటానికి అవకాశం ఇచ్చిని సమాజానికి కొంత భాగం తిరిగివ్వటమనేది కృతజ్ఞతా భావం.  చిన్న వ్యాపారులు అలాంటి సేవలు చేస్తూనేవుంటారు.  గుళ్ళు గోపురాలకు, శ్రీరామనవమిలాంటి పండుగలకు ఖర్చుపెడుతూనేవుంటారు.  పెద్ద పెద్ద సంస్థలు మాత్రం ఎంతసేపు వ్యాపారంలోనే పడి తప్పనిసరై ఒక్క రాజకీయ పార్టీలకు తప్ప వేరెవరికీ సాయం చెయ్యనివారున్నారు.  

అందువలన అటువంటి సంస్థలు- తమ లాభాన్ని పూర్తిగా ఇవ్వమనటం లేదు- సొంత లాభంలో కొంత శాతం- మీలా లక్ష్మీ ప్రసన్నం చేసుకోలేని అభాగ్యులకోసం ఖర్చు పెట్టమన్నది కెటిఆర్ చెప్పిన మాటల్లోని సందేశం.

-శ్రీజ

Serve society as well, Telangana IT Minister K Tarakarama Rao suggests Corporate business and non profiable organisations.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles