Congress eyes on mp seats left by modi and kcr

Congress contests by-elections, Modi left Vadodara by-elections, KCR left Medak by-elections. congress battles for LOP

Congress eyes on by-elections of MP seats left by Modi and KCR in 2014 elections after winning 3 seats in Uttarakhand

మోదీ కెసిఆర్ సీట్ల మీద కాంగ్రెస్ కన్ను?

Posted: 07/26/2014 12:45 PM IST
Congress eyes on mp seats left by modi and kcr

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో గుజరాత్ లో వడోదరా, ఉత్తర ప్రదేశ్ లో వారణాసి రెండు స్థానాల నుంచీ ఎంపీగా పోటీచేసారు, రెండు చోట్లా గెలిచారు.  అందులో వడోదరాను వదిలిపెట్టి వారణాసి ఎంపీగానే ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు.  ఆ కారణంగా వడోదరా లోక సభ స్థానం ఖాళీగా ఉంది.  

అలాగే తెలంగాణాలో తెరాస తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మెదక్ లోక్ సభ స్థానానికి, గజ్వేల్ నుంచి శాసనసభకు పోటీచేసారు.  ఆయనా రెండు చోట్ల గెలిచారు.  అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచెయ్యదలచుకున్న కెసిఆర్ లోక్ సభ స్థానాన్ని వదిలిపెట్టారు.  దానితో మెదక్ స్థానం ఖాళీ అయింది.

మరి ఈ స్థానాల్లో ఉపఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలుపొందుతుందా అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.  అందుకు కారణం ఉత్తరాఖండ్ లో జరిగిన ఉపఎన్నికలలో మూడు స్థానాలను గెలుచుకోవటమే.  అవీ భాజపా మీద పోటీ చేసి.  దీనితో మోదీ కెరటం పడిపోయిందన్న సంకేతాలు అందుతున్నాయని, ఇక ముందు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.  

అత్తెసరు మార్కులతో కనీసం పాసయ్యాననే తృప్తి కలిగించుకునే విద్యార్థిలా, ఇంకా ఎన్ని స్థానాలు గెలిస్తే 10 శాతం పూర్తవుతుంది.  ఎప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాతో లోక్ సభలో తలెత్తుకుని కూర్చోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉపఎన్నికలు నిర్వహిస్తారన్నది పరిశీలిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles