Mp kavita telangana kashmir remarks effigy burnt

trs mp kavita pok remark, trs kavita anti national remark, kavita telangana remark, telangana kashmir merger with indian union, bjp protesters burn kavita effigy

MP Kavita effigy burnt for Telangana Kashmir remarks with national news paper

కవిత మీద ఆగ్రహంతో దిష్టి బొమ్మ దగ్ధం

Posted: 07/25/2014 04:08 PM IST
Mp kavita telangana kashmir remarks effigy burnt

తెలంగాణా, కాశ్మీర్ లు భారతదేశంలో భాగం కావని, వాటిని న్యూఢిల్లీ బలవంతంగా భారత్ లో కలిపివేసిందని అన్న నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యలకు ఆగ్రహించిన భారతీయ జనతా పార్టీ, భాగ్యనగర్ ప్రజాహిత సమితి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేక నినాదాలతో నిరసనలు తెలియజేస్తూ ఆమె దిష్టి బొమ్మను దగ్ధం చేసారు.  

అంతేకాకుండా, కాశ్మీర్ లో భూభాగమంతా భారత్ ది కాదన్న విషయాన్ని తెలుసుకుని ప్రవర్తించాలని పార్లమెంటు సభ్యురాలి హోదాలో ఉన్న కవిత అనాలోచితంగా మిడిమిడి జ్ఞానంతో చేసిన వ్యాఖ్యల వలన భారతీయ నిజయీతీ మీద ప్రపంచవ్యాప్తంగా సందేహాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు.  కాంగ్రెస్, భాజపా రెండు పార్టీల నాయకులు కవిత అజ్ఞానంతో మాట్లాడిన మాటలను తప్పుపట్టారు.  

పాకిస్తాన్ మీడియా అప్పుడే కవిత మాటలను పాకిస్తాన్ ప్రయోజనంలో మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.   ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేసే వ్యాఖ్యలను ప్రపంచమంతా చూస్తుందని అటువంటి వ్యాఖ్యలు చెయ్యటం దురదృష్టకరమని అన్న భాజపా నాయకులు, జమ్మూ కాశ్మీర్ తెలంగాణా ప్రాంతాలను బలవంతంగా కలిపెయ్యటమన్నది కవిత తప్పుగా మాట్లాడుతున్న మాటలని, ప్రజాభీష్టం మేరకే ఆ ప్రాంతాలను కలపటం జరిగిందిని అన్నారు.  

ఇరు దేశాల మధ్య వివాదస్పదంగా ఉన్న పాకస్తాన్ ఆక్రమిత ప్రాంతం గురించి ఒక ప్రజాప్రతినిధే అలా మాట్లాడటం సరికాదన్నారు ఆందోళనకారులు.

ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు కొందరు నాయకులను అరెస్ట్ చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles