Rape and murder suspect tantrik babas beaten to death

girl killed hanged to tree, girl raped killed west bengal, rape suspect tantric beaten, west bengal tantric beaten, rape suspect tantric beaten to deth, rape suspect beaten to deth

Girl hanged to tree rape and murder; parent and villagers beat suspect tantrik babas to death before reporting police

రేపిస్ట్ లన్న అనుమానంతో కొట్టి చంపిన ఘటన

Posted: 07/25/2014 03:39 PM IST
Rape and murder suspect tantrik babas beaten to death

చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఈ మధ్య కాలంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ లో ఇద్దరు ఆడపిల్లలను సామూహిక అత్యాచారం తర్వాత చెట్లకి వేళ్ళాడదీసిన సంఘటన మర్చిపోకముందే, పశ్చిమ బెంగాల్ లో కాలియా బజార్ సమీపంలో చెట్టుకి వేళ్ళాడదీసిన చిన్న పిల్ల శవం గ్రామవాసులను ఆగ్రహావేశంతో ఊగిపొయేలా చేసింది.  

అంతకు ముందు రోజు నుంచి కనిపించని ఏడు సంవత్సరాల బాలికను వెదుకుతూ శవమై చెట్టుకి వేళ్ళాడుతున్న దృశ్యాన్ని చూసిన ఆ అమ్మాయి తల్లి దండ్రులతో పాటు గ్రామవాసులు కూడా అందుకు స్థానిక తాంత్రికుడు రతన్ దాస్ కారణమని నమ్ముతూ అతన్ని, అతని ఇద్దరు అనుచరులను గొడ్డుని బాదినట్లు విచక్షణారహితంగా కుళ్ళబొడిచారు.  ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ చేసారు.  ఆ ముగ్గురిలో ఒకతను హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

తాంత్రికుడి మీద అనుమానం రావటానికి కారణం ఆ బాలిక అంతకు ముందు రోజు అతనితో కనిపించటం.  దుకాణానికని ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి ఎంతకీ తిరిగి రాకపోవటంతో గ్రామస్తులతో కలిసి వెదకటానికి బయలుదేరిన ఆ అమ్మాయి తండ్రికి అమ్మాయి చెట్టుకి వేళ్ళాడుతూ కనిపించింది.  ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసివుంటారని, ఆ తర్వాత బదౌన్ లో జరిగినట్లుగా చెట్టుకి వేళ్ళాడదీసారని ఊహించారు.  ఎవరో ఆ అమ్మాయిని తాంత్రికుడితో మాట్లాడటం చూసారట.  అంతే అవేశంతో ఆ ముగ్గురినీ గ్రామస్తులంతా కలిసి ఇష్టమొచ్చినట్లుగా హింసించారు.  

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుఖేష్ కుమార్ జైన్ మాట్లాడుతూ, బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని చెప్తూ, అనుమానంతో కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారని తెలియజేసారు.  అసలింకా అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్లో ధృవీకరణ కాలేదని, ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలు కారణమవటానికి కూడా అవకాశం ఉందని సుఖేష్ కుమార్ అన్నారు.

శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అన్న ఎస్ పి చనిపోయిన అమ్మాయి కుటుంబానికి, నిందితుడిగా ఫిర్యాదు చేసిన రతన్ దాస్ కి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలున్నాయని కూడా తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles