Tv channels stopped in telangana trai ib ministry notices msos

tv9 abn andhra jyothi tv channels, tv channels stopped telangana, telangana msos stop tv channels, trai notice telangana msos, ib ministry notices telangana msos, rajyasabha mps question center inaction

TV Channels stopped in Telangana TRAI IB Ministry notices MSOs, MSOs

ప్రసారాల నిలిపివేతమీద కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర

Posted: 07/25/2014 01:53 PM IST
Tv channels stopped in telangana trai ib ministry notices msos

తెలంగాణా రాష్ట్రంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి 9 ప్రసారాలను నిలిపివేయటం మీద చివరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది.  

2102 ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏ ఛానెల్ నైనా నిలిపివేయటానికి 15 రోజుల ముందుగా చందాదారులు, టివి ఛానెల్స్ కి తెలియజేయవలసిన బాధ్యత ఎమ్ ఎస్ వోలదేనని, దాన్ని పాటించకుండా ట్రాయ్ నియమాలను ఉల్లంఘిస్తూ జూన్ 16 నుంచి ఆ ఛానెల్స ప్రసారాలను నిలిపివేసినందుకు కారణాలను ఆగస్ట్ 11 లోపులో తెలియజేయాలని టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఎమ్ఎస్ వోలందరికీ నోటీసులు పంపించింది.  అలా చెయ్యని పక్షంలో సకారణంగా నిలిపివేయలేదని భావిస్తూ చర్యలు తీసుకుంటామని ట్రాయ్ హెచ్చరించటం జరిగింది.

సమాచార, ప్రసార శాఖనుంచైతే ఆ ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేసినందుకు కేబుల్ నెట్ వర్క్ రూల్స్ 1994 లోని సబ్ రూల్ 16 కింద చర్య ఎందుకు తీసుకోగూడదో వివరిస్తూ సంజాయిషీని 3 రోజుల్లో ఇవ్వమని షోకాజ్ నోటీస్ జారీచేసింది.  ఈ షోకాజ్ నోటీసుని కేంద్ర మంత్రిత్వ శాఖాధికారి జూలై 17 నే సంతకం చేసారు.  

చందాదారులకు టివి ఛానెళ్ళ మేనేజ్ మెంట్ కి కారణాలు వివరిస్తూ నోటీసు నివ్వకుండా ప్రసారాలను నిలిపి వేయటంతో కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ చట్టం లోని నిబంధన 7 కింద కేబుల్ ఆపరేటర్లు తమ మెయింటెనెన్స్ రిజిస్టర్ ని కూడా ట్రాయ్ కి సమర్పించవలసిందిగా కూడా ఆ నోటీస్ లో ఉంది.  ప్రసారాలను నిలిపివేస్తున్న విషయాన్ని వార్తా పత్రికలలోను, టివి లో స్క్రోలింగ్ రూపంలోను ప్రకటించవలసిన అవసరం ఉంది.

తెలంగాణాలో ప్రధానమైన న్యూస్ ఛానెల్స్ రెండిటి ప్రసారాలనూ నిలిపివేయటం మీద కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి జవదేకర్, ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా లోగడ ఈ విషయం మీద లేఖ రాయగా కెసిఆర్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు.  

కానీ వచ్చే రాజ్యసభ సమావేశాల్లో దీని మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆలోచిస్తున్న ఎంపీలు, వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్న మరికొందరిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సత్వరం పట్టించుకుని నోటీసులు జారీ చెయ్యటం జరిగింది.  ఇలా జరగటానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ మౌఖిక ఆదేశాలే కారణమని అనుమానించినా, పైకి ఎక్కడా అందుకు ఆధారాలు లేవు కాబట్టి ప్రసారాల నిలిపివేత సంగతి చూడమని అంతకుముందు కేంద్ర మంత్రి జవదేకర్ కెసిఆర్ కే లేఖ రాయటం జరిగింది, ఆ ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేయటం జరిగింది.   అయితే ఇప్పుడు తాజాగా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోవటాన్ని ప్రశ్నించటానికి రేణుకా చౌధరి, వి హనుమంతరావు, పాల్వాయి, ఎంఏ ఖాన్, సుజనా చౌధరి, గుండు సుధారాణి మొదలైన ఎంపీలు సిద్దమౌతున్న నేపథ్యంలో భాజపా ప్రభుత్వం అప్రమత్తమై ఈ చర్య తీసుకుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles