Us hospital to pay 190 million for dirty doctor filming

doctor, filming, patients, Doctors, in human, behaviour, nikita levy, women patients, genetalia, videos, photos, sucide, compensation, camera, hopkins

The Johns Hopkins Health System in the US will pay $190 million in compensation to more than 7,000 women whose bodies were

7వేల మంది స్త్రీల అంగాలను బంధించిన డర్టీ డాక్టర్

Posted: 07/25/2014 10:00 AM IST
Us hospital to pay 190 million for dirty doctor filming

డాక్టర్ అంటే దేవుడితో సమానం. భర్తకు సొంతమైన ..జననాంగాలను, రెండో వ్యక్తిగా.. ఒక్క డాక్టరే చూడటం జరుగుతుంది. ఆడ డాక్టరైన, మగ డాక్టరైన దేవుడితో సమానం కాబట్టి, ఆరోగ్య కోసం ఆసుపత్రిలో . మహిళలు మౌనంగా వైద్యం చేయించుకుంటారు. అది డాక్టర్ పై నమ్మకంతోనే ఫేషేంట్ ఫ్రీగా ఉంటారు. కానీ ఇది అలుసుగా తీసుకొని ..ఒక డర్టీ డాక్టర్.. వైద్య వృత్తికే పెను మచ్చ తీసుకొచ్చాడు. సేతస్కోప్‌ పట్టుకోవాల్సిన చేత్తో స్పైకామ్‌ పట్టుకున్నాడు. పెల్విక్‌ టెస్టుల పేర 7000 మంది మహిళల జననాంగాలను చిత్రీకరించాడు.

దైవంలా భావించే వైద్యుణ్ణి రాక్షసుడు అనుకునేలా చేశాడు. దీంతో డాక్టర్‌ వద్ద స్టెతస్కోప్‌ మినహా పెన్ను ఉన్నా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేలా చేశాడు. తాను పనిచేస్తున్న ఆస్పత్రికీ చెడ్డపేరు తీసుకొచ్చాడు. 1140 కోట్ల పరిహారం చెల్లించేలా చేశాడు. ఈ దారుణ సంఘటన అమెరికాలోని బాల్తిమోర్‌లో ఉన్న హాప్కిన్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. జమైకాకు చెందిన నికిటా లెవీ అనే గైనకాలజిస్టు పెల్విక్‌ టెస్టులు (ఏదైనా ఇన్‌ఫెక్షన్లను లేదా ఇంకేదైరా సమస్య ఉన్నపుడు పొత్తి కడుపు కింద చేసే టెస్టులు) చేసే పేర ఓ స్పై కెమెరాతో వీడియోలు, ఫొటోలు తీశాడు.

Johns-Hopkins- Hospital-doctor

అయితే పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకున్నట్లు.. ఇతగాడూ తనను ఎవరూ అనుమానించట్లేదులే అన్న చందానా రహస్యంగా వీడియోలు తీసేవాడు. కానీ, ఒక రోజు అతడి దగ్గర పనిచేసే తన సహాయకురాలికి అనుమానం వచ్చి ఆస్పత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు 1300 వీడియోలు, వందలాది ఫొటోలు దర్శనమిచ్చాయి.

ఆ సంఘటన వెలుగులోకి రావడంతో నికిటా 2013 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చేసిన ఘనకార్యానికి ఫలితం అతడి చేతిలో మోసపోయిన దాదాపు 7000 మంది మహిళలకు సుమారు రూ. 1140 కోట్ల పరిహారాన్ని (190 మిలియన్‌ డాలర్లు) అతడు పనిచేసే ఆస్పత్రి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్కొక్క బాధితురాలికి సుమారు 16 లక్షల పరిహారం అందుతుందన్నమాట! అమెరికాలో ఇప్పటిదాకా ఓ డాక్టర్‌ మోసం చేసి.. ఆస్పత్రి చెల్లించే పరిహారాల్లో ఇదే అత్యధిక పరిహారం.

Johns-Hopkins-Hospital

25 ఏళ్ల అనుభవమున్న అతడు.. ఇప్పటిదాకా 12 వేల మందికిపైగానే పరీక్షలు చేశాడు. అయితే అతడు 2005 నుంచే వారి వీడియోలు తీయడం మొదలుపెట్టడంతో 7000 మందిని మాత్రమే బాధితులుగా ప్రకటించారు. తమ బీమా విధానాలను అనుసరించి బాధితులందరికీ పరిహారం చెల్లిస్తామని హాప్కిన్స్‌ యాజమాన్యం ప్రకటించింది. తమ పేషెంట్లు, ఉద్యోగులు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో ఎటువంటి రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles