Telangana govt exercise to adjust funds

Telangana Govt exercise to adjust funds, Election promises heavy on T Govt, TRS Election promises became heavy

Telangana Govt exercise to adjust funds to meet election promises

తెలంగాణా సర్కార్ ఆపద్ధర్మాలు

Posted: 07/24/2014 09:04 AM IST
Telangana govt exercise to adjust funds

చాప ఎంత ఉంటే కాలు అంతవరకే చాపాలన్న సామెత ఒకటుంది.  ఎంత చెట్టుకి అంత గాలి అని కూడా అనటం జరుగుతుంది.  ఎన్నికల ముందు హామీలు చేసేటప్పుడు నాయకుల దగ్గర ఆర్థిక గణాంకాలుండవు.  కేవలం ఏం చెప్తే ఎన్ని వోట్ల రాలవచ్చు అనే లెక్క మాత్రమే ఉంటుంది.  అందువలన ఎన్నో హామీలు ఇస్తుంటారు.  కానీ తీరా అధికారం చేతికి వచ్చేటప్పటికి వాళ్ళ ముందుకి ప్రభుత్వ ఖజనా పరిస్థితి ఏమిటన్నది అధికారులు తెలియజేస్తారు.  దానితో ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నాం అన్నది పూర్తిగా అర్థమౌతుంది.  అలాంటప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లూ వుండాలి, కానీ ఖజానా మీద అధిక భారం పడగూడదని ప్రభుత్వాలు ఆలోచించటం సహజం.

తెలంగాణా రాష్ట్రంలో చాలా మిగులు నిధులు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఎన్నో వరాలను గుప్పించటం జరిగింది.  కానీ వాస్తవానికి వస్తే వాటన్నిటినీ అమలు చెయ్యటం కష్ట సాధమైన పనని తెలిసిపోతోంది.  అలాంటప్పుడు వాటిని పూర్తిగా రద్దు చెయ్యటం కష్టం కాబట్టి భారాన్ని తగ్గించుకునే పని చేపట్టటం తప్పనిసరవుతుంది.  

ఒక ఉద్యోగానికి 100 మంది రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు, మార్కుల్లో పెద్దగా తేడా లేదు.  అప్పుడేం చేస్తారు.  ఇంటర్వ్యూలో వాళ్ళల్లో 99 మంది ఏరేస్తారు.  ముఖం నచ్చలేదు, నడక నచ్చలేదు, గొంతు బాగోలేదు- ఇలా ఏదో ఒక కారణంతో తగ్గించటం తప్పనిసరి.

పథకాల అమలులో కూడా అదే పరిస్థితి నెలకొంది.  విద్యార్థుల ఫీజ్ రియంబర్స్ మెంట్, వృద్ధులు వికలాంగులు వితంతు పెన్షన్లు, రైతు ఋణ మాఫీలు ఇవన్నీ తలకి మించిన భారమైన నేపథ్యంలో ఈ క్రింది సవరణలు తప్పని సరైనాయి.

వృద్ధులు వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ లను అక్టోబర్ రెండు నుంచి అమలులోకి తెస్తామని తెలంగాణా ప్రజలకు చెప్పటం జరిగింది.  కానీ దాని భారం రూ.4000 మేరకు పడబోతోంది.  మరి ప్రత్యామ్నాయమేమిటంటే వికలాంగులు కాకుండా ఇతరులలో ఒక ఇంటికి ఒక్కరికే పెన్షన్ ఇవ్వటం.  మరో విషయమేమిటంటే 60 కాకుండా 65 సంవత్సరాలు దాటిన వారినే వృద్ధులుగా పరిగణించాలని కూడా కెసిఆర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదట.

అలాగే ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టబోతోందని సమాచారం.  ఒకటి విద్యార్థి అటెండెన్స్ 75 శాతం తప్పనిసరిగా ఉండాలి.  రెండవది, ఫీజు చెల్లించిన తర్వాత ఆ విద్యార్థి నిర్దిష్టమైన మార్కులను సంపాదిస్తేనే రెండవ సంవత్సరం ఫీజ్ రియంబర్స్ మెంట్.  అంతేకానీ ఆటోమేటిక్ గా రెండవ సంవత్సరం రెన్యూవల్ జరగదు.

ఇక రైతు ఋణ మాఫీల సంగతి ఏమి తేలలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles