Governor narasimhan and ramzan iftar 2014

governor narasimhan and ramzan iftar 2014, YS Jagan Mohan Reddy, ESL Narsimhan, Chandrababu Naidu, Iftaar Party, Rajbhavan, KCR, Governor Narasimhan Iftar Party and ap cm Chandrababbu, ys jagan.

governor narasimhan and ramzan iftar 2014, Governor Narasimhan Iftar Party, Governor Narasimhan Iftar Party and ap cm Chandrababbu, ys jagan,

కేసిఆర్ రాకుండనే చంద్రబాబు గవర్నర్ ఇప్తార్?

Posted: 07/23/2014 08:20 PM IST
Governor narasimhan and ramzan iftar 2014

‘‘వస్తారు ..నా చంద్రులు.. ఈరోజే..!!. రానే వస్తారు.. నా చంద్రులు ఈరోజే...!! అనుకుంటూ.. పాట పాడుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు చేదు అనుభవం అయ్యింది. గవర్నర్ నరసింహన్ మాటలకు విలువ లేదు అనే విషయం ఈ ఇప్తార్ విందుతో బయటపడింది. ఒకరు ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇద్దరు సీఎంలకు ఒకే గవర్నర్. ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా .. గవర్నర్ .. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముస్లీం సోదరులకు, రాజకీయ నేతలకు ప్రత్యేక ఇఫార్త్ విందు ఏర్పాటు చేయటం జరిగింది. కానీ అర్థచంద్రుడితోనే.. గవర్నర్ నరసింహన్ ఆనందపడాల్సి వచ్చింది.

governor-narasimhan-babu- ramzan-iftar-2014

 

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరినీ ఆహ్వానించటం జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులకూ ఆహ్వానం అందింది. అయితే, ఈ ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరు కాగా, కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఈటెల రాజేందర్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత జగన్, టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, ఇరు రాష్ట్రాల డీజీపీలు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావు ఒకప్పుడు మంచి మిత్రులు... మరిప్పుడో రాజకీయ విరోధులు! ఈ ఇద్దరి మధ్య రాష్ట్ర విభజన అగాధాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విభజన జరిగి 50 రోజులవుతున్నా ఇప్పటికీ వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. మొన్నటికి మొన్న మహంకాళీ జాతర సందర్భంగా కాస్తలో చంద్రబాబు, కేసీఆర్ ల కలయిక తప్పిపోయింది. ఈ రోజు గవర్నర్ ఇఫ్తార్ విందులో వీరిద్దరూ మళ్లీ కలుస్తారని అందరు అనుకున్నారు. కానీ అదీ కూడా జరగలేదు. .ఇక భవిష్యత్తులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అనేక అంశాల్లో వీరిద్దరూ చర్చించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. మున్ముందు అయినా వీరిద్దరూ కలవాలని ఆశిద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles