Trs mp kavita comments on telangana not part of india

Telangana India occupied part, Telangana not part of India, Teangana as seperate soverign country, Pakistan deamdning Kashmir portion to be handed over to Pakistan, Handover Telangana to Nijam, Kavita comments on Telangana and Kashmir, Telangana not part of India Kavita says, Part of Kashmir not of India's land Kavita says

Kavita comments on Telangana not part of India but forcibly made part of it

తెలంగాణా భారత ఆక్రమిత ప్రాంతం - కవిత!

Posted: 07/23/2014 11:43 AM IST
Trs mp kavita comments on telangana not part of india

తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసిన తెలంగాణా అసలు భారత దేశంలో భాగమే కాదని, బలవంతంగా దాన్ని భారత దేశంలో కలిపారని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించటం సంచలనానికి దారితీసింది.  

రాష్ట్రాన్ని ముక్కలు చేసింది చాలదా ఇంకా దేశాన్ని కూడా ముక్కలు చెయ్యాలనుకుంటున్నారా అంటూ పలువురు రాజకీయ నాయకులు, అఖండ భారతాన్ని భారతమాతగా పూజిస్తున్న దేశ ప్రేమికులు విమర్శిస్తున్నారు.  ఇలాంటి మాటలతోనే తెలంగాణా ప్రజానీకం మనసులో విషబీజాలు నాటి ఆంద్రప్రదేశ్ నుంచి విడదీసారని, ఇక వాళ్ళల్లో దేశప్రేమను కూడా పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అంతేకాదు, తెలంగాణాని, కాశ్మీర్ తో పోలుస్తూ, ఈ రెండూ ప్రత్యేకమైన అధికారాలు గల రాజ్యాలని, భారత దేశానికి స్వాతంత్ర్యం తర్వాత ఈ రెండు భాగాలను బలవంతంగా, వాళ్ళ అనుమతి లేకుండానే భారతదేశంలో కలిపేసారని కవిత అన్నారు.  మరి కవిత సలహా ప్రకారం ఈవిధంగా ఇస్తూ పోతుంటే, పంజాబ్ ఆ తర్వాత బంగాల్దేసియులు ఆక్రమిస్తున్నా బెంగాల్ ఆ తర్వాత హైదరాబాద్ తర్వాత తమిళనాడు ..ఇలా అన్ని రాజ్యాలని విడగోత్తల్సి వస్తుంది!

కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండించింది.  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో పాటు పార్లమెంటు అభిప్రాయంలో కూడా అప్పటి కాశ్మీర్ రాజ్యం భారత భూభాగంలో భాగమేనని అన్నారు.  కవిత వ్యాఖ్యల మీద ఈ విధంగా స్పందించటానికి కారణాన్ని కూడా చెప్తూ, పార్లమెంట్ కి ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇలాంటి మాటలు మాట్లాడం వలన ఈ విషయంలో విదేశీ నాయకులు, ప్రభుత్వాలు, సంస్థలు దీన్ని తప్పుగా తీసుకోగూడదనే ఉద్యేశ్యంతోనే వివరణనీయటం జరిగిందన్నారు.  

స్వయంగా బాధ్యతాయుతమైన హోదాలో ఉండి, ముఖ్యమంత్రి కూతురైయ్యుండి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చెయ్యటం తగదని అన్నవాళ్ళల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.  

1947 లో తెలంగాణా, కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాలని చెప్తున్న కవిత మాటల్లో నిజాం పాలనను శ్లాఘిస్తున్నట్లే కనపడుతోంది.  ఇది కేవలం కవిత ఉద్దేశం మాత్రమే కాదు తెలంగాణా రాష్ట్ర సమితి ఉద్దేశ్యంలా కనిపిస్తోంది.  ఎందుకంటే లోగడ ఒక టివి ఇంటర్వ్యూలో ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, మేము భారతీయులం కాము  మమ్మల్ని బలవంతంగా భారతదేశంలో కలిపారు అన్నారు.  

కథ ఇంతటితో అయిపోలేదు.  ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకున్న కవిత, కాశ్మీర్ లో కొంత భాగం పాకిస్తాన్ కి చెందిందని, ఈ సత్యాన్ని మనం ఒప్పుకుని ఆ భాగాన్ని వదిలేసుకోవటం మంచిదని కూడా సలహా ఇస్తోంది.  అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మన దేశం లోది కాదట.  అందువలన దాన్ని వదిలిపెట్టటమే శ్రేయస్కరమట.  కాశ్మీర ప్రజలు కూడా దాన్ని పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతమనే అంటారు.  అలాంటిది తెలంగాణాలో ఉండి కాశ్మీర్ గురించి మాట్లాడటాన్ని అందులో కొంత భాగం మనం దేశానికి చెందింది కాదని అనటాన్ని అభిషేక్ సింఘ్వి తీవ్ర స్థాయిలో ఖండించారు. కాశ్మీర్ లాగే తెలంగాణా ని నిజాం కి ఇచ్చెయ్యాల? నిజాం కూడా పాకిస్తాన్ లో కలుస్తాను అన్నాడు కదా!

జమ్మూ కాశ్మీర్ లో లాగానే తెలంగాణా లో కూడా ఆ ప్రాంతాలకు చెందనివారు కొనుగోలు చెయ్యరాదనే నియమం ఉండేదని, కాన ఎన్టీ రామారావు మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నియమాన్ని సడలించి పెట్టుబడిదారులకు దార్లు తెరిచారని కవిత అన్నారు.  

-----------

TRS MP K Kavitha's made adverse comments reportedly on Kashmir issue to a National Newspaper: Kavitha Tuesday stirred controversy by saying that Kashmir, a region in north India and Telangana, a newly carved Indian state, are not part of India but have been forcibly occupied. She also remarked that India should redraw the international boundaries in J&K, accepting that "few parts" are not "ours" and then move on and that J&K and Telangana were both forcefully annexed to the Indian Union after Independence.

Kavitha's remarks came at The Indian Express Idea Exchange programme. Asserting that she feels strongly about J&K, she had said India should come clean on the state. "Few parts were not ours, we should agree, we should redraw the international lines and move on," she had said.

Congress party took strong exception to certain 'controversial' remarks made by Kavitha on Jammu Kashmir and Telangana, which the party believes could inadvertently cast serious doubts on the integrity and legitimacy of the Indian union.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles