Us court sentence to indo american ceo

US court sentence to Indo American CEO, Shailesh Shah CEO of Micro cap company, Shailesh shah from India jail sentence in US

US court sentence to Indo-American CEO Shailesh Shaw

ఇండో అమెరికన్ వ్యాపారికి శిక్ష విధించిన యుఎస్ కోర్టు!

Posted: 07/23/2014 09:38 AM IST
Us court sentence to indo american ceo

భారత సంతతికి చెందిన వ్యాపారికి ఆర్థిక నేరం కింద అమెరికన్ కోర్టు శిక్ష విధించింది. 

భారత్ సంతతికి చెందిన శైలేశ్ షా (43) అమెరికాలో రెండు పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీలకు సిఇఓ.  కాలిఫోర్నియాలోని చైనో లో నివసించే ఆయన తన కంపెనీ షేర్ల కొనుగోలు చెయ్యటానికి లంచం ఇవ్వజూసారన్న అభియోగం మీద ఆయన మీద ఎఫ్ బి ఐ కేసు పెట్టి దర్యాప్తు చేసింది.  ఆయన అమెరికన్ జిల్లా జడ్జ్ రిచర్డ్ స్టీర్న్స్ ఎదురుగా దోషినని ఒప్పుకున్నారు.  

ఎఫ్ బి ఐ ఏజెంటని తెలియక పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రతినిధి అనుకుని, ఎస్ఓహెచ్ఎం ఇంక్, కోస్టాస్ ఇంక్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ షా తన కంపెనీ వాటాలను కొనుగోలు చెయ్యటానికి అతని లంచం ఆఫర్ చేసారు.  మైక్రో క్యాప్ స్టాక్స్ అనేవి స్టాక్ ట్రేడింగ్ లో తక్కువ స్థాయిలో ఒక్కోసారి షేర్ పెన్నీ కి కూడా ట్రేడింగ్ జరిగేవి.  అలాంటి  మైక్రో క్యాప్ స్టాక్ మార్కెట్ లో నడుస్తున్న అవినీతిని అంతమొందించటానికి వచ్చిన ఎఫ్ బి ఐ ఏజెంట్ అని తెలియని షా అతనితో బేరాలాడి లంచం ఇవ్వజూసారు.  ఈ కేసులో ఆయన్ని ఫిబ్రవరి 27 న అరెస్ట్ చేసారు.   

ఈ నేరం మీద కోర్టు షా కి 20 సంవత్సరాల జైలు శిక్ష, ఆ తర్వాత 3 సంవత్సరాలు పరిశీలనలో విడుదల, 250000 డాలర్ల పెనాల్టీ ని కోర్టు శిక్షగా విధించింది.  ఇది అక్టోబర్ 23 నుంచి అమలు జరుగుతుందని ఎఫ్ బి ఐ తెలియజేసింది.  

శైలేశ్ షా తో పాటు చైనో, కాలిఫోర్నియాలోనే నివసించే సందీప్ షా (40) కి కూడా అదే విధమైన శిక్ష అమలు అవుతుంది.  సందీప్ షా క్యాప్ స్టాక్స్ ని ప్రమోట్ చేస్తూ పబ్లిక్ కంపెనీలకు నిధులను సమకూర్చటంలో తోడ్పడుతుంటారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles