Facebook and whatapp making youth addicted

Facebook and whatapp making youth addicted, Youth losing sleep due to chatting at night, Youth sleepless for late night chatting on phone

Facebook and whatapp making youth addicted to lose sleep at night

యువతకు పిచ్చెక్కిస్తున్న ఫోస్ బుక్ వాట్సాప్!

Posted: 07/22/2014 02:15 PM IST
Facebook and whatapp making youth addicted

ఫేస్ బుక్, వాట్పాప్ లు సెల్ ఫోన్ల ద్వారా వాడుకోగలగటంతో యువత వాళ్ళకి తెలియకుండానే గంటలు గంటలు వాటితో గడిపేస్తున్నారు.  అది కూడా వాళ్ళకి ఖాళీ ఉన్న సమయంలో, వాళ్ళదైన సమయంలో.   

చాటింగ్ లు, టెక్స్ట్ మెసేజ్ లు పంపుకోవటాలు, ఫేస్ బుక్ లో అప్ లోడ్ చెయ్యటం, ఇతరులు అప్ లోడ్ చేసిన ఫొటోలు వీడియోలు చూడటం వీటితో రాత్రి 1, 2 గంటలవుతున్నా సరే వదలలేకపోవటం జరుగుతోంది.  టీనేజ్ లో యువతకు ఎక్కువగా మిత్రులతో మాట్లాడటం, తమ ఉద్యేశ్యాలను పంచుకోవటం, తమ గురించి తాము చెప్పుకోవటం, ఇతరుల గురించి ఆరాలు తియ్యటం లాంటివి చేస్తుంటారు.  ఈ పనులకు అంతకు ముందు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునేవారు, లేదా మాట్లాడుకోవటం కోసం కలుసుకునేవారు.  

ఇప్పుడు ఆ అవసరం లేదు ఫేస్ బుక్, వాట్సాప్ లు దూరాలను దగ్గర చేస్తున్నాయి.  ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూనే సైలెంట్ గా మాట్లాడుకోవటానికి  చాటింగ్ లు ఉపయోగపడుతున్నాయి.  అవతలివాళ్ళకి నవ్వినట్లు, ఆశ్చర్యపోయినట్లు, బాధపడుతున్నట్లు కూడా తెలియాలి కాబట్టి, హాహా అనో, వోహ్ అనో, స్మైలీలను ఉపయోగించో తమ స్పందనను ప్రకటించుకోవటం కూడా చేస్తారు.  

అస్సోకామ్ చేసిన సర్వే ప్రకారం 60 శాతం యువత సగటున రోజుకి 125 టెక్స్ట్ మెసేజ్ లను పంపుతున్నారని తేలింది.  ఈ సర్వే జరిగింది 2012 లో.  దాన్నిబట్టి స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ల వాడకం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోవటంతో వాటిని ఉపయోగిస్తున్నవారి శాతంలోనూ, ప్రతిరోజూ పంపుతున్న మెసేజ్ లలోను ఎంత వృద్ధి జరిగివుంటుందన్నది ఊహించుకోవచ్చు.  

అంటే ఇదీ ఒక వ్యసనం అయిపోయింది. ప్రతిరోజూ సోషల్ మీడియాలో సంచారం చేసి రాకపోతే తృప్తివుండదు.  మొదలుపెట్టిన తర్వాత గంటలు గంటలు నడుస్తుంది ఆ ప్రక్రియ.  తెలియకుండానే అర్థరాత్రి దాటిపోతుంది.  పగలంతా చదువుసంధ్యలు, ఉద్యోగ బాధ్యతలు, ఇంట్లో పనులు, సొంతపనులు ఉంటాయి కాబట్టి రాత్రిపూట ప్రతివాళ్ళకీ తమదంటూ సొంత సమయం దొరుకుతుంది- ఎవరికోసమూ ఖర్చుపెట్టనవసరంలేని సమయం.  తమకి ఇష్టమైనవాళ్ళతో తమకోసమే నిశ్శబ్ద సంభాషణను సాగించవచ్చు.  దాని వలన ఇంట్లో ఇతరులకు అభ్యంతరాలు కానీ, నిద్రాభంగం కానీ ఉండవు.  ఆ నిద్రాభంగమంతా తామే అనుభవిస్తారు.  ఇ

అలా వ్యసనంగా మారిన మెసేజ్ చాటింగ్ లు చేసే అలవాటు నుండి తప్పించటానికి కూడా బెంగళూరులో డి ఎడిక్షన్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారంటే యువత మనసులో ఇది ఎంత గట్టిగా ముద్రవేసుకుని కూర్చుందో అర్థంచేసుకోవచ్చు.   

డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బెంగళూరు లో ఇంటర్నెట్ డి ఎడిక్షన్ క్లినిక్ ని నడుపుతున్నారు.  క్లినికల్ సైకాలజీలో అసెస్టెంట్ ప్రొఫెసరైన డాక్టర్ మనోజ్.

విద్యార్థులలో కొందరు, ఫోన్ చాటింగ్ వలన చదువు బాగా చెడిపోయిందని, సరైన మార్కులు రాక పై చదువులకు అడ్మిషన్ దొరకక కూడా బాధపడటం జరిగిందని, అయితే చాటింగ్ అలవాటుని మాత్రం వదులుకోలేకపోతున్నామని అంటున్నారు.  రాత్రిపూట ఎలాగూ ఉంటోంది.  అదికాకుండా పగలు కూడా తింటున్నప్పుడో టివి చూస్తూనో కూడా చాటింగ్ లు చేస్తుంటారని టీనేజ్ పిల్లల తల్లులు చెప్తున్నారు.  

యువతీయువకులుకు రోజుకి 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం.  అది పూర్తవకపోవటంతో అది వాళ్ళ ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, శరీరారోగ్యాల మీద ప్రభావాన్ని చూపుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.  అంతే కాకుండా పగలు ఎక్కడబడితే అక్కడ నిద్ర రావటం ముఖ్యంగా క్లాస్ జరుగుతున్నప్పుడు ఇబ్బందికరంగానే ఉంటోందంటున్నారు కొందరు విద్యార్థులు.   అయినా రాత్రి అయేసరికి వాళ్ళ చేతి వేళ్ళు చాటింగ్ చెయ్యటం కోసం పరుగులు తీస్తుంటాయి.  

వాట్సప్ వచ్చిన తర్వాత ఎస్ఎమ్ఎస్ ల నుండి యువకులే కాకుండా పెద్దవాళ్ళు కూడా నెమ్మదిగా వాట్సప్ కి మారిపోతున్నారు.  సర్వేలు చెయ్యటానికి కారణం అడ్వర్టైజ్ మెంట్ లు ఎందులో ఎక్కువగా ఇవ్వాలో తెలియటం కోసం కూడా జరుగుతుంది.  అమెరికాకు చెందిన జానా మొబైల్ చేసిన సర్వే ప్రకారం భారత దేశంలో 55 శాతం మెసేజ్ లు వాట్సప్ ద్వారా జరుగుతున్నాయి.  కేరళలో ఇంటర్నెట్ సంస్థ మోబ్ మి బోర్డ్ మీటింగ్ అవగానే మినిట్స్ ని వాట్సప్ ఉపయోగించి బోర్డు మెంబర్లకు సర్క్యులేట్ చేసారట.

ఎస్ఎమ్ఎస్ కి ఖర్చుపెట్టాలి కానీ వాట్సప్ లోచాటింగ్ ఫ్రీ కాబట్టి కూడా యువత దీనికి ఆకర్షితులౌతున్నారు.  చివరకు వ్యసనంలా మార్చుకుంటున్నారు.  బ్లాక్ బెర్రీ, హైక్ లలాగా కాకుండా వాట్సప్ ఫోన్ లోని కాంటాక్ట్ నంబర్లతో అనుసంధానమౌతుంది.  గ్రూప్ లతో కూడా ఒకేసారి చాటింగ్ చెయ్యవచ్చు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలను పంచుకోవచ్చు.  

ఈ సౌలభ్యాలన్నీ ఉండబట్టే ఇది వ్యసనంగా మారుతోంది.  ఈ విషయంలో డి ఎడిక్షన్ కేంద్రాల వరకు వెళ్ళకుండా ముందుగానే యువత తమ నడవడిని మార్చుకుని పరికరాన్ని పరికరంగానే ఉపయోగించుకుంటూ, అది మన కోసం ఉంది కానీ దాని కోసం మనం కాదు, ఏది ఎంత వరకు అవసరం అన్నది గమనించి, అందులో చాటింగ్ కి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంతే ఇచ్చినట్లయితే ఇటు సద్వినియోగం చేసినట్లవుతుంది, ఆరోగ్యమూ చెడకుండా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.   

అందరిలా మామూలుగా నార్మల్ గా ఉండకపోవటాన్నే ఉన్మాదం అంటాము.  రాత్రంతా వదిలిపెట్టకుండా చాటింగ్ చేస్తున్నవారిని కూడా వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ లోపించటం వలన ఉన్మాదం అనే అనవలసివస్తుంది కానీ కాస్త దాన్ని తగ్గించి వ్యసనం అని కూడా అనకుండా అలవాటయింది అంటున్నాం.   ఎందుకంటే అందరూ ఆ పని చేస్తున్నప్పుడు అది చెయ్యనివాళ్ళనే నార్మల్ గా లేరని అనుకుంటాం.  అది కూడా వాళ్ళని వ్యసనపరులను చేస్తోంది.  చాటింగ్ చెయ్యకపోతే ఏమీ రాదని, వెనకబడిపోయామని అనుకుంటారేమో అనేది కూడా వాళ్ళని ఇందులోకి లాగేస్తుంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles