80 children on board crashed malaysian airlines flight 17

80 children dead, Malaysia Airlines flight MH17 crash, 80 children crashed Malaysian, 0 children on board MH17,

At least one American was on board the Malaysia Airlines flight shot down ... MH17 are pictured on July 18, 2014 in Shaktarsk, the day after it crashed. ... carrying 298 people, including 80 children

ఆకాశంలో రాలిన 80 చిన్నారి చిరునవ్వులు!

Posted: 07/22/2014 09:12 AM IST
80 children on board crashed malaysian airlines flight 17

పాలు కారే పసి మొగ్గలం, పాపం.. పుణ్యం తెలియాని ..ప్రాణం ఉన్న బొమ్మలం, ..ప్రపంచంలో ఎవరికి కోపం వచ్చినా .. ఫలితం మా పై ఉంటుంది. ఎవడికి ఉన్మాదం పూనినా.. మా వీపులు వాచిపోవాల్సిందే. కామంధులకు కోరిక కలిగితే.. మాపైనే ప్రయోగం, ఉగ్రవాదులకు ఆగ్రహం వస్తే.. ఆకాశంలోనే మా చిరునవ్వులు చీకట్లో కలిసిపోవాల్సిందే. !!!స్కూళ్లలో టీచర్ల కరకు కేన్ బెత్తాలు ముద్దులొలికే చేతులను ఎర్రబారుస్తుంటే.. ఆలనాపాలనా చూడాల్సిన సిబ్బంది రాక్షసులుగా మారి.. చిదిమేస్తుంటే.. మౌనంగా భరించడమే తప్ప.. అది ఎందుకు జరుగుతున్నదో తెలియని అమాయకులం.!!

మన హైదరాబాద్‌లోని డాన్‌బాస్కో స్కూలు కావచ్చు.. బెంగళూరులోని విబిజియర్ స్కూలు కావచ్చు.. తాజాగా కాకినాడలోని అంధుల పాఠశాల కావచ్చు! ప్రాణం ఉన్న పసి మొగ్గలకే అన్యాయం!! ఏమిటీ పాపం? పసి మొగ్గలపై కక్ష దేనికి? దీనికి అంతం లేదా? అని మాలేసియా విమానాన్ని ఉక్రెయిన్ లో దాడి చేసిన ఘటనలో పసిమొగ్గలు ఆకాశంలోనే రాలిపోయాయి.

80-CHILDREN-malaysian-airlines-dead

ఒకటికాదు.. రెండు కాదు.. 80 మంది చిన్నారుల ఊపిర్లు.. మలేసియా విమానం కూల్చివేతతో మాయమయ్యాయి. కొద్దిగంటల ముందు తమ ఆప్తులతో కలిసి.. హాయిగా చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన ఆ చిన్నారులకు ఇవే తమ చివరినవ్వులని ఊహించే శక్తి ఉంటుందా? మరోదేశంలో ఉన్న తమ కుటుంబాలను, బంధువులను కలిసి.. సెలవులు ఆనందంగా గడపాలనుకున్న ఆ పాపాయిలకు ప్రపంచం ఇంత పాపాత్మమైనదని అంచనావేసే స్థాయి ఉంటుందా? ఉక్రెయిన్‌లో ఎవరు చేసిన పాపమో ఇంకా తేలని విమానం కూల్చివేత ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు పసికందులు కూడా ఉన్నారు.

80-CHILDREN-dead-in-malaysian

 

ఆస్ట్రేలియన్ తల్లి రిన్ నోరిస్ తన తండ్రి నిక్‌తోపాటు.. 12, 10, 8 ఏండ్ల వయసు ఉన్న ముగ్గురు పిల్లలను కూడా కోల్పోయారు. కుటుంబం మొత్తం యూరప్‌లో సెలవులు గడిపేందుకు వారు తాతయ్యతో కలిసి బయల్దేరారు. నోరిస్, ఆమె భర్త మాత్రం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు భరించరాని గోస అనుభవిస్తున్నారు. హోలాండ్ వెళుతున్న దంపతుల 21 నెలల పసిగుడ్డు కూడా ఈ ఘోర కలికి బలైపోయింది. మలేసియా విమాన దుర్ఘటనలో ఇటువంటి గుండెలు పిండే ఉదంతాలు ఎన్నో! క్షిపణి కూల్చిన విమానంలో ఛిద్రమైపోయిన ఈ చిన్నారుల శవాలు దొరుకుతాయో లేదోనన్నది మనసు కలిచివేసే అనుమానం!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles