Subramanian swamy warns kcr

subramanian swamy warns kcr, article 256 can be used against kcr, president rule if a state violates center rule, fees reimbursement issue in telangana

Subramanian Swamy warns KCR on local non local issue on taking 1956 as cut off year

కెసిఆర్ ని హెచ్చరించిన సుబ్రమణ్యస్వామి

Posted: 07/21/2014 05:53 PM IST
Subramanian swamy warns kcr

స్థానికత విషయంలో రాద్ధాంతం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో భాగమని మర్చిపోవద్దని గుర్తు చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి, అవసరమైతే రాజ్యాంగంలోని ఆర్టికిల్ 256 ను ఉపయోగించి ఆయనను కట్టడి చెయ్యవలసివస్తుందని హెచ్చరించారు.

తెలంగాణాలో నివసించే ఇతర రాష్ట్రాల పౌరులలో భయాన్ని సృష్టిస్తున్నారని, దేశంలోని నాన్ లోకల్స్ కి కూడా ఇక్కడ నివసించే హక్కుందని సుబ్రమణ్య స్వామి ఆదివారం హైద్రాబాద్ లో పేట్రియాటిక్ సొసైటీ నిర్వహించిన చర్చలో అన్నారు.  

రాజ్యాంగంలోని ఆర్టికిల్ 256 ఇలా చెప్తుంది- ప్రతి రాష్ట్రానికి ఉన్న అధికారాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేసిన చట్టాలకు, రాష్ట్రంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడివుండాలి.  ఏదైనా విషయంలో అవసరమనిపిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలిచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.   

1956 ని కటాఫ్ సంవత్సరంగా కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయానకి అభ్యంతరాలు తెల్పిన సుబ్రమణ్య స్వామి పై ఆర్టికిల్ ని ఉపయోగించి రాష్ట్రాలకు ఆదేశాలివ్వవచ్చని, అప్పటికీ ఒప్పుకోకపోతే ఆర్టికిల్ 360 ని ఉపయోగించి రాష్ట్రపతిపాలనను కూడా విధించవచ్చని సుబ్రమణ్య స్వామి తెలియజేసారు.  

రాజ్యాంగంలోను లిటిగేషన్ లోను దిట్టైన సుబ్రమణ్య స్వామి అంటే దేశంలో నాయకులందరికీ హడలే ఏ వివాదంతో కోర్టు గుమ్మంలో కాలుపెడతారోనని.  

అయితే ఇక్కడ కెసిఆర్ దగ్గరో ఏస్ కార్డ్ ఉంది.  అదేమిటంటే, స్థానికతను వదిలిపెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలచుకున్న ఫీజ్ రియంబర్స్ మెంట్ లో మాత్రమే ఆ విధంగా పరిగణిస్తామని చెప్పటం.  ఫీజ్ రియంబర్స్ మెంటు ఇచ్చేది విద్యార్థులందరికీ కాదు కేవలం వృత్తివిద్యలోని విద్యార్థులకే.  అందువలన 1956 తర్వాత వచ్చేవారిని స్థానికులుగా గుర్తించినా,  ఫీజ్ రియంబర్స్ మెంట్ మాత్రం కొందరికే వర్తించేట్టు చేద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.  దానికి ఏ కేంద్ర చట్టమూ అడ్డురాకపోవచ్చని కెసిఆర్ ఉద్దేశ్యమైయ్యుంటుంది.  అందుకే, ఈ విషయంలో న్యాయసలహాలను తీసుకున్నామని లోగడ కెసిఆర్ అన్నారు.  ఇతరులు స్థానికులు కారు అని అనకపోతే వచ్చే ప్రమాదమే లేదు.

గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళచ్చు, తలని నీటిలో కూడా ముంచవచ్చు కానీ నీళ్ళు తాగించలేము అనే సామెత ఉంది.  ఎవరెన్ని హెచ్చరికలు చేసినా పథకం అమలు చేసే విధానం మారవచ్చు కానీ ప్రయోజనం కేవలం తెలంగాణా విద్యార్థులకే చెందాలి అన్న కెసిఆర్ సంకల్పమైతే మారదు కదా!

సుబ్రమణ్య స్వామి మరో మాట కూడా అన్నారు- 1956 కటాఫ్ సంవత్సరంగా పెట్టినందువలన ఆధారాలు చూపించలేని తెలంగాణా విద్యార్థులకే ఎక్కువ నష్టం కలుగుతుందని, ఖజానా మీద భారాన్ని తగ్గించుకోవటం కోసమే కెసిఆర్ ఆ విధంగా రాజకీయమాడుతున్నారని కూడా ఆయన అన్నారు. 

-శ్రీజ

Click here for Article 360

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles