Face book media saved student life

face book media saved student’s life, liver transplantation in critical condition in kolkata, social media amazing help to ailing student

Face book media saved student’s life in a critical liver transplantation case

విద్యార్థి ప్రాణాలు నిలిపిన ఫేస్ బుక్

Posted: 07/21/2014 01:26 PM IST
Face book media saved student life

ఫేస్ బుక్ ద్వారా సోషల్ మీడియాలో ఎంత త్వరగా ఎక్కువమందితో సంపర్కాన్ని స్థాపించుకుని ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టవచ్చన్నదే కాకుండా ప్రాణాలు నిలిపిన ఉదంతం కోల్కతా లో జరిగింది.

20 సంవత్సరాల వయసులో ఉన్న శ్రీజని హైదర్ కోల్కతా లోని సెయింటి గ్జేవియర్ కాలేజ్ లో హానర్స విద్యార్థిని.  45 రోజుల క్రితం ఉన్నట్టుండి ఆమె శరీరంలో కామెర్లు ప్రకోపించి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది.  ఆమె కాలేయం పూర్తిగా దెబ్బతిని ఎందుకూ పనికిరాని స్థితికి, ఎవరూ బాగుచెయ్యలేని స్థితికి వెళ్ళిపోయింది.  

మార్చ్ నెలాంతంలోనే ఆమెకు కామెర్లు వచ్చాయని తెలుసుకున్న తర్వాత మామూలుగా చేసే వైద్య చికిత్సలను చేయించారు.  కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. రోజురోజుకీ ఆమె స్థితి దిగజారుతూ ఆమె చదువు కూడా కుంటుబడింది.  ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయిన కామెర్ల వ్యాధి ఆమెను కోమాలోకి తీసుకెళ్ళింది.  మే 27 న ఆమెకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని తెలిసి, కూతురు ప్రాణాలను కాపాడుకోవటం కోసం ఆమె తల్లి బబిత ఏమాత్రం సంశయించకుండా తన లివర్ లో 65 శాతాన్ని కూతురికి మార్పిడి చెయ్యమని వైద్యులను కోరింది.  

ఇంతవరకు బాగానే వుంది.  తల్లిగా కన్న కూతురు ప్రాణాలు కాపాడుకోవటం కోసం తన కాలేయంలో ముక్కను కోసి కూతురికి అమర్చమని కోరుకునేటప్పుడు ఆ తర్వాత లివర్ మళ్ళీ మామూలు సైజ్ కి పెరుగుతుందని ఆమెకు తెలియదు.  ఆమె దృష్టంతా బిడ్డను బ్రతికించుకోవటం మీదనే ఉంది.  అయితే అందుకు అయ్యే ఖర్చు సామాన్యమైంది కాదు.  2.2 మిలియన్ రూపాయల అవసరం పడుతుంది.

ఈ లోపులో హైదర్ కోమాలో ఉన్న సమయంలో ఆమె స్నేహితులు, టీచర్లు సోషల్ మీడియాలో ఈ సంగతి తెలియజేసి 1.8 మిలియన్ రూపాయలను చందాల రూపంలో వసూలు చేసారు.  లివర్ మార్పిడి విజయవంతంగా జరిగింది.  శ్రీజని హైదర్ తల్లి లివర్ డొనేట్ చెయ్యటం, ఫేస్ బుక్ ద్వారా వైద్య చికిత్సకు కావలసిన డొనేషన్స్ ని వసూలు చెయ్యటం, ఈ రెండే ఆమెను బ్రతికించాయి.  

తర్వాత అంతా తెలుసుకున్న శ్రీజని హైదర్, ఫేస్ బుక్ అద్భుతం చేసిందని చెప్తూ, దానివలన తనకి జరిగిన లాభాన్ని మాటల్లో చెప్పలేనిదని అంది.  నేను కోమాలో ఉన్నప్పుడు నా స్థితి ఎలా ఉండేదో తలచుకుంటే భయం వేస్తుంది.  నన్ను నా కుటుంబం, నా స్నేహితులు, ఫేస్ బుక్ మాత్రమే రక్షించాయని అన్నదామె.  మే 27 నుంచే ఆమె పరిస్థితి, ఆమె తండ్రి బ్యాంక్ ఖాతా వివరాలను ఫేస్ బుక్ లో ప్రచారం చేసిన ఫలితంగానే చందాలు వసూలయ్యాయి.  

ఆమె తండ్రి అంజాన్ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఉద్యోగి.  కష్టపడి నాలుగు లక్షలు పోగుచేసాను కానీ మొత్తం 30 లక్షలు అవసరం పడిందని, ఫేస్ బుక్ ఆ అవసరాన్ని తీర్చిందని, బంధువులు, స్నేహితుల ద్వారా ఎవరెవరికో అజ్ఞాత దాతలకు ఈ సమాచారం చేరటంతో వారి దగ్గర్నుంచి డబ్బు వచ్చిందని చెప్తూ సోషల్ మీడియా గురించి తనకు అంతవరకు ఉన్న అభిప్రాయం మారిపోయిందని అన్నారు.  

శ్రీజని హైదర్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య చికిత్స అపోలో గ్లినీగల్స్ హాస్పిటల్ లో జరిగింది.  ఆ హాస్పిటల్ లోని గాస్ట్రో ఎన్ట్రియాలజిస్ట్ మహేష్ గోయంకా కేసుని వివరిస్తూ, 36 గంటల్లో అంతా చెయ్యవలసి వచ్చిందని, రోగి పరిస్థితినిబట్టి ఆలోచించి ప్రణాళికాబద్ధంగా వైద్యం చెయ్యటానికి కూడా సమయం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ట్రాన్స్ ప్లాంటేషన్ జరగటం ఈ తూర్పు ప్రాంతంలో ఇదే మొదటిసారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles