Telugu tv anchor arrested in abusing a school teacher case

Telugu TV Anchor arrested, TV channel anchor was arrested, Telugu music channel, school teacher, Mohammed Khayyum, Lobo, Begumpet police registered a case, Nirbhaya Act.

A Telugu TV channel anchor was arrested on Saturday for misbehaving and abusing a teacher at Begumpet. The accused has been identified as Mohammed Khayyum alias Lobo, 28, the anchor of a Telugu music channel

టీవీ యాంకర్ పొగరు దించిన మహిళా టీచర్!

Posted: 07/21/2014 01:01 PM IST
Telugu tv anchor arrested in abusing a school teacher case

ఈ మద్య కాలంలో.. సెలబ్రిటీ హోదాలోకి టీవీ యాంకర్ కూడా వస్తున్నారు. మేము సెలబ్రిటీలం అని పబ్లిక్ లో గుర్తింపు తెచ్చుకోవటానికి చిన్న చిన్న వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బుల్లితెర మీద యాంకర్లు అంటే.. గల గల మాట్లాడుతూ.. అందర్ని ఆకట్టుకుంటారు. కానీ బయట అలా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. హైదరాబాద్ నగరంలో బుల్లితెర యాంకర్లు చాలా మంది మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతమంది అతి ఉత్సహం వల్ల కొన్నివివాదాల్లో చిక్కుకున్నవారు ఉన్నారు.

మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న మహమ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో అనే అతను.. రాత్రి అమీర్ పేట నుండి సికింద్రాబాద్ వెళ్లుతున్న సమయంలో బేగంపేట ప్రాంతానికి వచ్చేసరికి పెట్రోల్ సిగ్నల్ పడింది. దీంతో.. దగ్గరల్లో ఉన్న ఐబిపి పెట్రోల్ బంకులో వెళ్లతున్నప్పుడు.. అక్కడ ఫ్రైవేట్ స్కూల్ మహిళ టీచర్ స్కూటీ పై తన గమ్యం వైపు వెళ్లుతుంది. అయితే టీవీ యాంకర్ కు బైకు పెట్రోల్ బంకు కు వెళ్లటానికి అడ్డుగా ఉందని, ఆ మహిళ టీచర్ పై .. మా మ్యూజిక్ టీవీ యాంకర్ అసభ్య పదజలంతో, పబ్లిక్ లో వ్యక్తిగత దూషణలకు దిగటజం జరిగింది.

దీంతో ఆ మహిళ టీచర్ బేగం పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే బేగం పేట పోలీస్ స్టేషన్ ఎస్సై యం. ప్రభాకర్ రెడ్డి 509 సెక్షన్, 2013 నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి టీవీ యాంకర్ ను అరెస్ట్ చేసి, కోర్టు కు హాజరుపరచటం జరిగింది. దీంతో మహిళలపై రక్షణ ఉంటుందని.. కొత్త ప్రభుత్వలో మహిళలు నమ్ముతున్నారు. మరోకోణంలో చూస్తే.. ఇప్పటి వరకు ఎవరికి పెద్దగా తెలియని మా మ్యూజిక్ యాంకర్ లోబో., ఈ వివాదంతో పాపులర్ అయ్యాడని కొంతమంది అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles