Former cm ashok chavan faces disqualification

former cm ashok chavan faces disqualification, ec disqualification order to former maha cm, mp chavan faces disqualification from ec

former cm ashok chavan faces disqualification

ఎమ్మెల్యేగా చేసిన తప్పులకు పరిహారం ఎంపీగా...

Posted: 07/14/2014 01:25 PM IST
Former cm ashok chavan faces disqualification

ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తేలిగ్గా తీసుకున్న రాజకీయ నాయకులు ఇకముందు రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ చట్టం (RP Act) లోని నియమాలను కచ్చితంగా పాటించవలసివుంటుంది.  2009 లో ఎన్నికై మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ ఆర్ పి యాక్ట్ నియమాలకు అనుగుణంగా ఎన్నికల ఖర్చును ప్రకటించనందున ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆయనకు నోటీసు పంపించింది.  ఆ నోటీస్ ద్వారా, 20 రోజుల్లో అశోక్ చవాన్ ఎన్నికల ఖర్చులో కొంతభాగాన్ని వెల్లడి చెయ్యనందుకు సరైన కారణం చూపించవలసిందని, లేనిపక్షంలో ఆయన 2014 లో నాందేడ్ నుంచి ఎంపీగా అయిన ఎన్నికను రద్దు చేస్తామని ఈసి చెప్పటం జరిగింది.  

2009 ఎన్నికలలో 25 పెయిడ్ న్యూస్ లుగా పరిగణించే ప్రకటనలను విడుదల చేసిన అశోక్ చవాన్ వాటి సంగతి తనకు తెలియదని చెప్పటానికి వీల్లేని విధంగా ఉన్నాయని ఈసి అభిప్రాయం.   ఆ వార్తలలో చవాన్ ముఖ్యమంత్రి గా ఉన్న టెర్మ్ ని గురించి పొగుడుతూ రాయటం జరిగింది.  ఆర్డర్ ని పూర్తిగా చూడలేదని, కానీ పెయిడ్ న్యూస్ మాత్రం లేవని చవాన్ గట్టిగా వాదిస్తున్నారు.  

2009 లో ఎన్నికలలో ఓడిన మాధవ్ రావ్ కిన్హాల్కర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసి చవాన్ కి నోటీస్ ఇవ్వటం జరిగింది.  అయితే చవాన్ హైకోర్టుని, సుప్రీం కోర్టుని ఆశ్రయించి ఈసి దర్యాప్తును నిలిపివేసే ప్రయత్నం చేసారు.  

చవన్ తాను ఇప్పుడు అసెంబ్లీ సభ్యుడు కాదని తాను పార్లమెంట్ సభ్యుడు కాబట్టి అప్పటి దర్యాప్తులు ఇప్పుడు తన మీద వర్తించవని అన్న వాదనను ఇసి తన ఆర్డర్ లో సమ్మతించలేదు.  ఆర్ పి యాక్ట్ ప్రకారం తప్పు సమాచారం ఇచ్చిన ప్రజాప్రతినిధి ఆ తర్వాత పార్లమెంట్ కి కాని శాసనసభకు కానీ ఏ హౌస్ లోనైనా గాని పోటీ చెయ్యటానికి అర్హతను కోల్పోతారని ఈసి ఆర్డర్ తెలియజేస్తోంది.  

ఇది కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పిగా తయారైంది.  చవాన్ అనర్హుడైన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర నుంచి ఒకే ఎంపి మిగిలివుంటారు.  పెయిడ్ న్యూస్ విషయంలో మీడియా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, అందుకు తగిన డిస్క్లైమర్లను కూడా ప్రచురించాలని పోల్ పేనల్ సూచించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles