Passport lost four times still eligible for fresh one

high court orders to issue passport, passport lost four times still eligible for fresh one, negligence no sin delhi high court observes

passport lost four times still eligible for fresh one

అది మీ పని! పాస్ పోర్ట్ ఇవ్వండి- హైకోర్ట్ ఆర్డర్

Posted: 07/14/2014 01:20 PM IST
Passport lost four times still eligible for fresh one

ఢిల్లీకి చెందిన వికాస్ మూడు సార్లు పాస్ పోర్ట్ ని పోగొట్టుకుని నాలుగోసారి జారీ చేసిన పాస్ పోర్ట్ ని శిథిలావస్థలో తీసుకుని వచ్చి మరోసారి పాస్ పోర్ట్ ని ఇవ్వమని కోరగా ఢిల్లీ లోని పాస్ పోర్ట్ అధికారులు అందుకు నిరాకరిస్తూ నిర్లక్షం నీవంతు, పనిచెయ్యటం మా వంతా అని ఆగ్రహించారు.  ఎన్నిసార్లిస్తాం పాస్ పోర్ట్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి!  మరో సారి పాస్ పోర్ట్ ఇవ్వం పొమ్మని పంపించేసారు.  దానితో అతను హైకోర్టుని ఆశ్రయించాడు.

అతను నిర్లక్ష్యంగా పోగొట్టుకోవటం, పాడుచేసుకోవటం చేసుండవచ్చు కానీ అతనికి విదేశాలకు పోయే హక్కుంది, మీకు పాస్ పోర్ట్ ని జారీ చెయ్యవలసిన బాధ్యతుంది అని హైకోర్టు పాస్ పోర్ట్ జారీ చెయ్యవలసిందిగా అధికారులను ఆదేశించింది.

కొంతమంది తాళం చెవులను పారేసుకుంటారు, కొంతమంది సెల్ ఫోన్లను ఎక్కడో వదిలేసుకుంటారు, కొంతమంది కొన్ని అవసరమైన వస్తువులనైనా జాగ్రత్తగా పెట్టుకోలేరు.  దాన్ని నిర్లక్ష్యం అంటాం.  కానీ అది వాళ్ళ మానసిక లోపం.  కొన్ని పనులను కొందరు సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేరు.  నిర్లక్ష్యమే అయినా దాన్ని నేరంగా పరిగణించని కోర్టు నిర్లక్ష్యానికి శిక్ష వెయ్యలేమని తేల్చి చెప్పింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles