Prof k nageswar mlc hints kcr

Prof K Nageswar MLC hints KCR, KCR is advised of immediate steps for social justice, Social justice in Telangana advises K.Nageswar to KCR

Prof K Nageswar MLC hints KCR

సామాజిక తెలంగాణాకి సత్వర చర్యలు!

Posted: 07/14/2014 01:07 PM IST
Prof k nageswar mlc hints kcr

సామాజిక తెలంగాణా సాధించాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలన్నదానిలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్యమంత్రి కెసిఆర్ కి వివరించేపనిలో పడ్డారు.  ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిపార్ట్ మెంట్ లో పనిచేసారు.  10 టివి కి ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న నాగేశ్వర్ సామాజిక తెలంగాణా గురించే మొదటి నుంచీ మాట్లాడుతూ వస్తున్నారు.

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో లేకపోయినా తెలంగాణా ఉద్యమ సమయంలో ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడిన నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత కూడా తెరాస కు సానుకూలంగా వ్యవహరిస్తూవచ్చారు.  మండలి ఛైర్మన్ ఎన్నికలలో కూడా తెరాసకు అనుకూలంగా వోటేసారు.  కానీ తన వ్యక్తిగత భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ఆయన ఇలా ప్రదర్శించారు.

దళితులకు, ముస్లింలకు కెసిఆర్ ఉపముఖ్యమంత్రి పదవులిచ్చారు బాగానేవుంది కానీ దానితోనే సామాజిక తెలంగాణా వచ్చినట్టు కాదని అంటున్నారు నాగేశ్వర్.  
90 శాతం పేద దళితులకు జరపవలసిన భూపంపిణీ కార్యక్రమాన్ని సత్వరం చేపట్టాలని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు.  పారిశ్రామికీకరణ పెరగటం ద్వారానే ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందని నాగేశ్వర్ కెసిఆర్ కి సూచించారు.

పై విధంగా చర్యలు తీసుకుంటేనే సామాజిక తెలంగాణా ఏర్పడుతుంది కానీ కొన్నివర్గాల వారికి పదవులను కట్టబెట్టినంత మాత్రాన సామాజిక తెలంగాణా సాధించినట్లు కాదన్నది నాగేశ్వర్ వాదన.  అందువలన సామాజిక తెలంగాణా సాధించటానికి తీసుకోవలసిన చర్యలను సత్వరం తీసుకోవలసిన అవసరం ఉందంటారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles