Ds comments on polavaram ordinance

DS comments on Polavaram ordinance, Ordinance merging seven Mandals in AP, Telangana bandh against Polavaram ordinance

DS comments on Polavaram ordinance

ఆర్డినెన్స్ మచ్చను తొలగించుకునే ప్రయత్నం?

Posted: 07/12/2014 01:17 PM IST
Ds comments on polavaram ordinance

రాజకీయాల్లో నెగ్గుకురావటం నిజంగా చాలా కష్టమైన పనే.  ఆత్మవంచనకు సిద్ధపడితేనే అది కుదురుతుందని మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాటలలో అర్థమౌతోంది.  ఏమాత్రం బిడియపడకుండా అవసరానికి తగ్గట్టుగా మాటను మార్చగలిగే స్తోమతున్నవాళ్ళే రాజకీయాలలో రాణిస్తారనే నమ్మకం బాగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.  

పోలవరం ఆర్డినెన్స్ మీద తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే, ఆ అర్డినెన్స్ ని అప్పట్లోనే పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ మచ్చను తొలగించుకోవాలని చూస్తున్నట్లుంది.  అబ్బే అయిష్టంగానే తెచ్చామా ఆర్డినెన్స్ అంటున్నారు డిఎస్.  

ముందు రాష్ట్ర విభజనను హడావిడిగా చేసేసి తెలంగాణా ప్రాంత ప్రజల నుంచి మద్దతు సంపాదించి, అదే సమయంలో ఆంధ్రా ప్రాంతం నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం పోలవరం మీద ఆర్డినెన్స్ ని పాస్ చేసి దాని మీద రాష్ట్రపతి ఆమోదం పడకుండా మధ్యలో ఆపి, చూసారా మేము ఇరు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పిజూసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నాయకుడు డిఎస్ ఇప్పుడు అదంతా ఊరకే ఇష్టం లేకపోయినా చేసాం లెండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో పరపతి పోకుండా చూద్దామనే ప్రయత్నంలో ఉన్నారు.  

ఆపరేషన్ సక్సెస్ కానీ దురదృష్టం రోగి ప్రాణాలు దక్కలేదు అన్నట్లుగా ఎంతలేసి రాజకీయపుటెత్తులు వేసినా రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలలోను ఘోర పరాజయం చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణాలో పరువు నిలబెట్టుకోవాలనే చూస్తోందని డిఎస్ మాటల్లో ద్యోతకమౌతోంది.  

అయితే ఇలా తెలంగాణా ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మళ్ళీ ఆంధ్రాలో వ్యతిరేకత వస్తుందేమో, ప్రాచుర్యం తగ్గిపోతుందేమో అనే భయమేమీ అక్కర్లేదు.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రాబల్యం ఎలాగూ లేదు.  కనీసం కాస్తో కూస్తో ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న తెలంగాణా రాష్ట్రంలోనైనా మాట దక్కించుకోవాలన్నదే డిఎస్ మాటల్లోని అంతర్యమని తేటతెల్లమౌతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles