Telangana official seal dispute

Telangana official seal dispute, KCR first signature official seal of Telangana, Objections in Telangana official seal

Telangana official seal dispute

రాజుకుంటున్న రాజముద్ర వివాదం!

Posted: 07/12/2014 12:13 PM IST
Telangana official seal dispute

తెలంగాణా ముఖ్యమంత్రి ఆమోదించి చేసిన తొలిసంతకం తెలంగాణా రాష్ట్ర రాజముద్ర.  ఇది ఆ రోజు నుంచే సర్వత్రా నిరసలను ఎదుర్కుంటోంది.  కాకతీయ తోరణం కింద చార్మినార్ ఏమిటని కొందరంటే కారణమేమిటో సరిగ్గా చెప్పకుండానే ఇదేం డిజైన్ అని మరికొందరన్నారు.  

చిత్రకారుడు లక్ష్మణ్ యేలే రూపొందించిన రాజముద్ర డిజైన్ మీద హైద్రాబాద్ వాసి టి.ధనగోపాల్ అనే వ్యక్తి హైకోర్టు లో పిటిషన్ ని కూడా వేసారు.  మూడు సింహాల కింద ఉండవలసిన సత్యమేవ జయతే అన్న దేవనాగరి లిపిలోని పదాలు ఉండాల్సినదానికంటే ఎక్కువ దూరంలో ఉందని, అది చట్టవిరుద్ధమని పేర్కొంటూ ధనగోపాల్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, లక్ష్మణ యేలే ల మీద కేసు పెట్టారు.  

మరో చిత్రకారుడు అందులోని కాకతీయ తోరణం వేరేలా ఉందని, అను ఫాంట్స్ డిజైన్ లోంచి తీసుకున్నదే కాని వాస్తవ రూపంలో లేదని ఆరోపించారు.  

అయితే ఇది ముఖ్యమంత్రిగా కెసిఆర్ చేసిన తొలి సంతకం కాబట్టి దాని విలువను కాపాడుతూ వివాదాలు తొలగిపోతేనే మేలు.  అసలు పని తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి అనేది దృష్టిలో పెట్టుకుని పాలకులను ఇతర విషయాలలో వివాదాలలో ఇరికిస్తే రాష్ట్రానికే నష్టమనేది కూడా విమర్శకులు ఆలోచించాలి.  అలా అని విమర్శలు చెయ్యవద్దని కాదు.  తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకునిపోవటం అవసరమే కానీ దేన్నీ వివాదంలోకి తీసికెళ్ళకుండా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆలోచించాలి. 

అలాగే పాలకులు కూడా ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అందరినీ సంప్రదించి అంత్య నిర్ణయం తీసుకోవటం అందరికీ మంచిది.  అప్పుడే అభివృద్థి మీద ఎక్కువ దృష్టి పెట్టటానికి అవకాశం ఉంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles