New invention of rollable tvs from lg

new lg oled tv, 18 inches oled tv that can be rolled, new invention of rollable tvs from lg, lg brings out rollable tv

new invention of rollable tvs from lg

చాపలా చుట్టగలిగే టివి వచ్చేసింది

Posted: 07/11/2014 05:32 PM IST
New invention of rollable tvs from lg

హిరాణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి తీసుకునిపోతుంటే అడ్డుపడ్డాడట శ్రీహరి.  ఇప్పుడు ప్రపంచానికే దర్పణమైన టివిని చుట్టబెట్టే రోజులు వచ్చేసాయి.  టివి అంటే ఎత్తటానికి బరువుగా ఉండే రోజులు పోయి, తేలిగ్గా తీసుకెళ్ళగలిగే, ఆ తర్వాత తక్కువ జాగాను ఆక్రమించి గోడకు వేళ్ళాడదీయగలిగే టివిలు వచ్చినా, అవి కింద పడితే పగిలిపోతాయి కాబట్టి జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళ్ళవలసి వచ్చేది.  కానీ ఇప్పుడు ఏకంగా వాటిని చుట్టి తీసుకెళ్ళగలిగే వెసులుబాటును కలిగిస్తున్నారు శాస్త్రజ్ఞులు.

ఎలక్ట్రానిక్ రంగంలో ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎల్ జి సంస్థ తయారు చేసిన 18 అంగుళాల టివిని చుట్ట చుట్టి పట్టికెళ్ళవచ్చు.  ఓఎల్ఇడి టెక్నాలజీని ఉపయోగించి ఈ టివి ని తయారు చేసామని, ముందు ముందు మరింత పెద్ద టివిలను కూడా ఈ విధంగా తయారు చేస్తామని అంటున్నారు ఆ సంస్థలోని డిస్ప్లే విభాగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు.  

ఇందులోని చిత్రాలు 1200 x 810 పిక్సెల్స్ లో స్పష్టంగా చూసే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles