Budget not clear about certain aspects related to ap

Budget not clear about certain aspects related to AP, AP Finance Minister not totally happy about Union budget, AP Chief Minister happy about Union budget

Budget not clear about certain aspects related to AP

బడ్జెట్ లో ఆం.ప్ర కి లభించని స్పష్టత

Posted: 07/11/2014 02:16 PM IST
Budget not clear about certain aspects related to ap

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలాలనే చేజిక్కించుకున్నా, కొన్ని అవసరమైన విషయాలలో స్పష్టత లభించలేదు.

ఆల్ ఇండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 20 పరిశ్రమల కేంద్రాలతో చెన్నై విశాఖపట్నం కారిడార్,  వ్యవసాయ విశ్వవిద్యాలయం, హిందుపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, కాకినాడ కృష్ణపట్నం పోర్ట్ ల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం, కృష్ణపట్నానికి పారిశ్రామక స్మార్ట్ సిటీ గా అభివృద్ధి లాంటి ప్రయోజనాలను కలిగించినా, ఈ క్రింది విషయాలలో స్పష్టత లేనందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యావేత్తలు అసంతృప్తిని వెల్లడి చేస్తున్నారు.

1. రాజధాని నగరాన్ని నిర్మించటానికి కేంద్రం చేసే ఆర్థిక సహాయం ఎంత చేస్తారన్నది బడ్జెట్ లో ప్రకటించలేదు,

2. రాష్ట్ర పునర్విభజన బిల్లును పాస్ చేస్తున్న సమయంలో రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వాగ్దానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన లేదు.  

3. అదే సమయంలో వాగ్దానం చేసిన ఇండియన్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కి బడ్జెట్ లో కేటాయింపు లేదు.

4. కేంద్రం అంతకు ముందు ప్రతిపాదించిన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బడ్జెట్ లో కేటాయింపు లేదు.

5. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో ఇస్తానన్న స్పెషల్ ప్యాకేజ్ విషయంలో బడ్జెట్ లో కేటాయింపును ప్రకటించలేదు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అవసరమైన వెసులుబాట్లనన్నిటినీ బడ్జెట్ లో పొందుపరచలేదని అన్నారు.  రాష్ట్రంలో కొరత బడ్జెట్ రూ.16000 కోట్లుండగా రూ.1180 కోట్ల ఆర్థిక సహాయం ఏదో సర్దుకుపోవలసినదే కానీ నిజానికి ఏ మూలా కాదని అన్నారాయన.  

కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం బడ్జెట్ మీద తన సంపూర్ణమైన సంతృప్తిని వెలిబుచ్చుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జాతీయ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలమీదకు ఎక్కించే ప్రయత్నం చేసారని అన్నారు.  కేంద్రం సహాయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు.  త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ లా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నట్లుగా ఆయన తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles