Union finance minister arun jaitely budget presentation

union budget 2014-2015, union finance minister budget presentation, arun jaitely budget presentation, first budget presentation of bjp

Union Finance Minister Budget presentation

ఆర్థిక మంత్రి బ్రీఫ్ కేస్ మారిపోయింది

Posted: 07/11/2014 10:13 AM IST
Union finance minister arun jaitely budget presentation

ఆర్థిక మంత్రి తన బ్రీఫ్ కేస్ ని ఎక్కడా పోగొట్టుకోలేదు.  కేవలం రంగు మారిందంతే.  నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ కి బడ్జెట్ నివేదికను తీసుకుని వచ్చిన బ్రీఫ్ కేస్ రంగు బ్రౌన్ కలర్ లో ఉంది.  ఇంతవరకు ఆర్థికమంత్రులందరూ ఎర్రరంగు బ్రీఫ్ కేస్ లోనే బడ్జెట్ నివేదికను పార్లమెంట్ కి పట్టుకునివచ్చే ఆనవాయితీకి అరుణ్ జైట్లీ తిలోదకాలిచ్చారు.  
కొత్త ప్రభుత్వం, కొత్తగా బడ్జెట్ తయారు చెయ్యటంతో పాటుగా బ్రీఫ్ కేస్ రంగుని కూడా పాతకాలపు ఆచారాన్ని అనుసరించదలచుకోలేదన్న విషయం అరణ్ జైట్లా బ్రీఫ్ కేస్ ని చూస్తే అర్థమౌతుంది.  

బ్రీఫ్ కేస్ రంగు పెద్ద విశేషమా అంటే, అది దేశమంతా విశేషమే.  ఎందుకంటే బ్రీఫ్ కేస్ పట్టుకున్న ఆర్థిక మంత్రిని టివిల్లో చూపించటం, ప్రత్యేకం ఆ ఫొటొను పత్రికలలో ప్రచురించటం ఆనవాయితీ.  ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణం లాగా బడ్జెట్ ని ప్రవేశపెట్టే రోజున దేశమంతా ఆత్రుతగా ఎదురుచూసేది వాళ్ళకి ఏం ఒరగబోతోందన్నదే.  అది ఆ బ్రీఫ్ కేస్ లో నిక్షిప్తమైయ్యుంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూపించటం జరుగుతుంది.
 
నిజానికి బడ్జెట్ మొత్తాన్ని ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నం చేసేది బహు కొద్దిమందే.  అందులో ఈకలు పీకటానికి చూసేవాళ్ళే ఎక్కువమంది.  అసలు దేశం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది, బడ్జెట్ లో ప్రతిపాదించినవి అమలు చెయ్యటానికి ప్రభుత్వం చేతిలో ఉన్న వనరులు సరిపోతాయా, లేకపోతే ఏం చేస్తారన్నది చాలా తక్కువ మంది పట్టించుకుంటారు.  మనకేం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏం లాభం కలుగబోతోంది అన్నది మాత్రమే చూసుకుంటారు-  తండ్రి దగ్గర డబ్బులున్నాయో లేదో పట్టదు కానీ తనకి మోటార్ సైకిల్ కొని ఇస్తాడా లేదా అని మాత్రమే చూసే కుమారుడిలాగా.  

రంగు మార్పు ఏమైనా ఆశించదగ్గ మార్పుని తెస్తుందేమో చూద్దాం!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles