Chandrababu naidu using space technology to improve andhra pradesh state

chandrababu naidu using space technology to improve andhra pradesh state, chandrababu naidu latest news, chandrababu naidu news, chandrababu naidu using space technology, chandrababu naidu with isro chairman radhakrishna, isro chairman meeting with radha krishna

chandrababu naidu using space technology to improve andhra pradesh state

చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా..?

Posted: 07/10/2014 04:19 PM IST
Chandrababu naidu using space technology to improve andhra pradesh state

(Image source from: chandrababu naidu using space technology to improve andhra pradesh state)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... తన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పరుచుకున్న ప్రణాళికలు ఫలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో వున్న సామాన్య ప్రజల అభివృద్ధి కోసం తాజా స్పేస్ టెక్నాలజీని, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం నెల్లూరులోని శ్రీహరికోటలో ఇస్రో వారు ఏర్పాటు చేసిన పీఎస్ఎల్ బీసీ-23 లాంచింగ్ లో ప్రధాని నరేంద్రమోడీతో కలిసి పాల్గొన్న చంద్రబాబునాయుడు... అక్కడ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ ను కలుసుకున్నారు. తనను హైదరాబాదులో కలవాల్సిందిగా ఆయన కోరారు. బాబు కోరికమేరకే రాధాకృష్ణన్ తన సైంటిస్టులతో కలిసి హైదరాబాదులో బాబును కలవడానికి వచ్చారు. ఈ చర్చలో బాబు వారితో ఆంధ్రలో వున్న చాలా సమస్యల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది.

సుదీర్ఘ చర్చానంతరం ఇస్రో, ఆంధ్ర రాష్ట్ర సాంకేతిక శాఖ శాస్త్రవేత్తలు కలిసి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతాల్లో అరుదుగా వున్న ఎర్రచందనాన్ని ఒక కొత్త టెక్నాలజీ ద్వారా కనుక్కొని.. దానిని అంతర్జాతీయ స్థాయిలో వున్న టెండర్లను ఆహ్వానించి వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి వున్న ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి కోసం కావాల్సిన డబ్బు కొంతలో కొంతయినా అందుతుందన్న ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కొత్త స్పేస్ టెక్నాలజీ ద్వారా అందే ఆదాయంతో ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందేలా చేయవచ్చునని అంటున్నారు. యావత్తు భారతదేశంలో ఇటువంటి తరహా టెక్నాలజీ వాడటం ఇదే మొదటిసారి అని వారు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ పద్ధతి గనుక విజయం అయితే.. చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చాలా త్వరలోనే అవుతుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles