Delhi government orders kejriwal to leave official home

Delhi government orders kejriwal to leave Official home, aravind kejriwal latest news, aravind kejriwal news, aravind kejriwal dharna, delhi government orders kejriwal to leave official home, delhi governament fire on kejriwal

Delhi government orders kejriwal to leave Official home

ఢిల్లీ నగరవీధుల్లో ఊడ్చుకుంటున్న కేజ్రీవాల్

Posted: 07/10/2014 02:20 PM IST
Delhi government orders kejriwal to leave official home

(Image source from: Delhi government orders kejriwal to leave Official home)

మన భారతదేశంలో కొంతకాలం క్రితం ఎవరూ ఊహించని కొన్ని సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా రాజకీయాల్లో అయితే మరీనూ! ఇందులో భాగంగానే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ రాజకీయ జీవితం కూడా అచ్చం ఒక సినిమా స్టోరీలా గడిచిపోయింది. ‘‘ఒకే ఒక్కడు’’ సినిమాలో ఏ విధంగా అయితే హీరో ఒక్కరోజు సీఎం పీఠాన్ని దక్కించుకుని రాజకీయ నేతలకు ముచ్చెమటలు పట్టించి, ప్రేక్షకాదరణ పొందుతాడో... అలాగే కేజ్రీవాల్ కూడా ఇంకా సీఎం పీఠాన్ని దక్కించుకోకముందే అప్పట్లో అధికారపార్టీని పరుగులు పెట్టించాడు.

రాజకీయ నాయకులు చేసిన అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టిన కేజ్రీవాల్.. కొద్దికాలంలోనే లీడర్ గా ఎదిగిపోయాడు. ఢిల్లీ నగరవాసులందరూ కేజ్రీవాల్ బాటలో నడిచారు. అతనితో కలిసి సేవ్ ఇండియా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, సంచలన లీడర్ గా తెరకెక్కిపోయాడు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... అధికారపార్టీని చిత్తుగా ఓడించి, ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సంతోషం చాలారోజులవరకు నిలవలేకపోయింది.

కేవలం లోక్ పాల్ బిల్లు పాస్ కాలేదన్న ఒకే ఒక్క కారణంతో కేజ్రీవాల్ రాజీనామా చేసి, మరో సంచలనాన్ని సృష్టించాడు. అవినీతి కాంగ్రెస్ పార్టీని మన దేశం నుంచి వెళ్లగొట్టండి అంటూ నినాదాలు చేస్తూ.. రోడ్లపై ర్యాలీలు చేయడం మొదలు పెట్టేశాడు. కానీ ఇతడు సీఎం పదవికి రాజీనామా చేయడం సామాన్య ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆయన తీసుకున్న నిర్ణయం సరియైంది కాదంటూ ప్రతిఒక్కరు విమర్శలు చేస్తూనే.. ఆయన నుంచి దూరంగా జరిగిపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన కేజ్రీవాల్... ఢిల్లీ నగరవాసులకు క్షమాపణలు చెప్పుకున్నాడు.

ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడం తప్పేనని నేను ఒప్పుకుంటున్నాను. అందుకు మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటాను. మీరు నన్ను తిరిగి ఢిల్లీ సీఎం పీఠం దక్కేలా చేస్తే... మీకు అనుగుణంగా నడుచుకుంటాను. నేను సీఎంగా వున్నప్పుడు ప్రవేశపెట్టుకున్న పథకాలను పూర్తి చేస్తాను. దయచేసి నన్ను మళ్లీ సీఎం చేయండి అంటూ వీధివీధుల్లో తిరుగుతూ అడుక్కుతినడం ప్రారంభించాడు. కానీ ప్రజలు మాత్రం ఇతనికి మొండిచెయ్యే చూపిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈయనకు మొండి చెయ్యే చూపించినట్లు కనిపిస్తోంది.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ కు తాను నివాసం వుంటున్న అధికారిక నివాసాన్ని జూలై నెలాఖరులోగా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం ఈయనకు తిలక్ లేన్ లో అధికారిక నివాసాన్ని కేటాయించింది. అయితే కొద్దిరోజుల్లోనే సీఎం పదవి నుంచి తప్పుకున్న కేజ్రీ... 15 రోజులపాటు ఆ నివాసంలో ఉచితంగానే వున్నారు. ఆ తర్వాత నెలకు రూ.80 వేలు అద్దె చెల్లిస్తూ అందులోనే కొనసాగుతూ వస్తున్నారు.

అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని తాజాగా నెలరోజుల గడువుతో కూడిన తాఖీదులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య.. తమకు ప్రభుత్వ క్వార్తర్స్ లో ఏదైనా ఒక నివాసాన్ని కేటాయించాల్సిందిగా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీనేత ఒకరు... తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ కుటుంబం ఇదివరకు నివాసమున్న ప్రాంతానికే తరలివెళ్లనున్నట్టు పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ కు ఇలా నోటీసులు జారీ చేయడంతో ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏమీ చేయాలో తోచక ఆందోళనల్లో ముగినిపోయారు. తిరిగి అధికారం ఎలాగైనా పొందాలనే ఆశతో ఆయన వీధివీధుల్లో తిరుగుతూ ప్రచారాలు చేసుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన పార్టీ గుర్తు అయిన చీపురుతో ప్రతిఒక్కరి ఇంటిముందు కేజ్రీవాల్ ఊడ్చుకుంటున్నారని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles