The main elements in 2014 15 union budget

The main elements in 2014-15 union budget, union budget 20145-15, union budget 20145-15 news, union budget 20145-15 latest news, the main elements in union budget 20145-15, arun jaitley in lok sabha, arun jaitley reveales union budget 20145-15 in lok sabha

The main elements in 2014-15 union budget

2014-15 కేంద్ర బడ్జెట్ లోని ప్రధానాంశాలు

Posted: 07/10/2014 12:33 PM IST
The main elements in 2014 15 union budget

(Image source from: The main elements in 2014-15 union budget)

2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మోడీ సర్కారులో విడుదలైన ఈ తొలి బడ్జెట్ లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ప్రధానాంశాలు ఇవే :

* ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ ను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందించాం.

* ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 50,548 కోట్లు.

* గ్రామాణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు.

* గ్రామీణ తాగునీటికి రూ. 3,600 కోట్లు.

* బాలికల సాధికారతకు రూ.100 కోట్లు.

* ఆడపిల్లలను చదివించండి, రక్షించండి పథకానికి రూ. 500 కోట్లు.

* మహిళల భద్రతకు రూ. 150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు.

* అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు.

* ఏపీలో ఎయిమ్స్, ఐఐటీ ఏర్పాటు. ఎయిమ్స్ కోసం రూ. 500 కోట్ల కేటాయింపు.

* ఆంధ్రప్రదేశ్, బెంగాల్, విదర్భ, పూర్వాంచల్ రాష్ట్రాలకు ఎయిమ్స్. అంచెలంచలుగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్.

* 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. నెలకు రూ. 1000 పెన్షన్. ఈ పథకం కోసం రూ. 250 కోట్ల కేటాయింపు.

* ఆంధ్రప్రదేశ్ కు అగ్రికల్చర్ యూనివర్శిటీ. తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్శిటీ.

* కొత్తగా 12 మెడికల్ కాలేజీలు (వైద్య,దంత).

* ప్రధాని గ్రామ్ సడక్ యోజనకు రూ. 14,389 కోట్లు.

* 2019 నాటికి పరిశుభ్ర భారత్.

* గ్రామీణ గృహ నిర్మాణానికి రూ. 8000 కోట్లు.

* నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం.

* 2022 నాటికి అందరికీ నివాసం.

* దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు.

* ఏకీకృత ప్రావిడెంట్ ఫండ్ విధానం కోసం ఈపీఎఫ్ వో ప్రారంభం.

* సర్వశిక్షా అభయాన్ కు రూ. 28,635 కోట్లు.

* మదర్సాల అభివృద్ధికి రూ. 100 కోట్లు.

* వాటర్ షెడ్ పథకానికి రూ. 2142 కోట్లు.

* మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు.

* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు. జాతీయ బ్యాంకుల్లో వాటాల అమ్మకం ద్వారా మూలధనం పెంపు. అయితే, అధిక వాటాను ప్రభుత్వం కలిగి ఉంటుంది.

* గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 14,389 కోట్లు.

* నగరాల్లో మెట్రో పనులకు రూ. 100 కోట్లు.

* కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అభివృద్ధికి రూ. 100 కోట్లు.

* ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలకు రూ. 500 కోట్లు.

* మహిళలకు పావలా వడ్డీ పథకం 250 జిల్లాలకు పెంపు

* రైతుల కోసం కిసాన్ టెలివిజన్ కు రూ. 100 కోట్లు.

* వ్యవసాయ రంగంలో గోదాముల నిర్మాణానికి రూ. 5000 వేల కోట్లు.

* వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధికి రూ. 500 కోట్లు.

* దేశవ్యాప్తంగా 100 మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలు.

* పథకాల్లో తాగునీటి పథకానికి రూ. 28635 కోట్లు.

* వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్. ఈ కారిడార్ లో తొలుత 20 పరిశ్రమలు.

* ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి కాకినాడ పోర్టు కీలకం.

* ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం,అధిక వృద్ధి రేటును పెంచడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యం.

* రానున్న 3-4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వృద్ధి రేటును సాధిస్తాం.

* పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం.

* ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం.

* భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం.

* జీఎస్ టీ అమలుపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాలతో చర్చించి జీఎస్ టీ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.

* పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేస్తాం.

* ఇన్స్యూరెన్స్ రంగంలో ఎఫ్ డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంపు.

* రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంపు.

* పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం.

* కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం.

* పన్ను చెల్లింపుదారుల సమస్యల సరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం.

* దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం.

* దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం.

* గుజరాత్ లో నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రూ. 200 కోట్లు కేస్తాయిస్తున్నాం.

* కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం.

* 4.1 శాతానికి కరెంట్ ఖాతా లోటు కష్టమయినా తగ్గించారు. 2015-16 నాటికి 3.6 శాతానికి, 2016-17 నాటికి 2 శాతానికి తగ్గించాలనేదే మా లక్ష్యం. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.

* వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు. వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles