Space research projects necessity to the nation

isro earned 40 m euros on satellite launching, mars orbit cost till date 349.9 crore, union minister jitender singh on space projects

Space Research projects necessity to the nation

స్పేస్ ప్రాజెక్ట్స్ వలన లాభమా నష్టమా?

Posted: 07/10/2014 11:36 AM IST
Space research projects necessity to the nation

2011 నుంచి ఇప్పటివరకు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇతర దేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకునిపోయి వదిలిపెట్టటం వలన దేశానికి గడించిపెట్టిన సంపాదన 40 మిలియన్ యూరోలు.  ఈ విషయాన్ని అటామిక్ ఎనర్జీ, ఎర్త్ సైన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ కి మంత్రిత్వ బాధ్యతలను వహిస్తున్న జితేందర్ సింగ్ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలియజేసారు.  

భారత దేశ స్పేస్ ప్రాజెక్ట్ సాంకేతికంగా స్వయం సమృద్ధిని సాధించటంతో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించగలుగుతోంది.  ఇండియన్ స్పేస్ రిసెర్చ్ మన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టటమే కాకుండా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా స్పేస్ లోకి తీసుకునిపోవటంతో అంతకు ముందు వెచ్చించిన ఖర్చుకి బదులుగా ఇప్పుడు విదేశాలనుంచి ఆదాయాన్ని సంపాదిస్తోంది.  కేంద్ర మంత్రి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం ఇస్రో సంపాదన 39.82 మిలియన్ యూరోలు.  2020 వలకు స్పేస్ ప్రోగ్రాంలు సిద్ధంగా ఉన్నాయని కూడా మంత్రి తెలియజేసారు.  

ఇస్రో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన మార్స్ ఆర్బిటర్ మొత్తం ఖర్చు అంచనా రూ. 450 కోట్లైతే, ఇప్పటికే రూ. 349.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని కూడా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలియజేసారు.  

దేశంలో ఇంత దారిద్ర్యం, ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఇంత ఖర్చు పెట్టటం అవసరమా అంటే, దేశం అన్ని రంగాలలోను పురోగమించటం ఆశించదగ్గదే.  అందులోను స్పేస్ ప్రాజెక్ట్ ఖర్చుతో పాటుగా ఆదాయ వనరులను కూడా పెంచుతున్న సందర్భంలో అది వాంఛనీయమే.  ఎందుకంటే ఈ స్పేస్ ప్రాజెక్ట్ ల వలన భారత దేశం సాంకేతికంగా ఎంతో ముందుకు పోబోతున్నది.  సమాచార వ్యవస్థ ఇంకా పటిష్టం కాబోతున్నది.  భూపరిశీలనలో నియమించే ఉపగ్రహాల వలన ఎంతో ముఖ్యమైన సమాచారం అందబోతున్నది.  అందులో నావిగేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగకరమైనది.  దీని సాయంతో అపాయాలలో చిక్కుకుపోయిన వాహనాలను గుర్తించి వెతికిపట్టుకోవటం లాంటి ట్రాకింగ్ కి ఉపయోగపడుతుంది.  

ఆదాయం లేకపోయినా చెయ్యవలసిన సాంకేతిక పురోగతి ఇది.  అలాంటప్పుడు ఉపగ్రహాల లాంచింగ్ కోసం విదేశీయులకు చెల్లించే పైకం ఆదా చేసుకోవటమే కాకుండా విదేశాల నుంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్న సమయంలో స్పేస్ రిసెర్చ్, శాటిలైట్ లాంచింగ్ లాంటి పనులు దేశానికి పేరు తెచ్చిపెట్టి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టటమే కాకుండా దేశంలోని సాంకేతికాభివృద్ధికి కూడా బాటలు వేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ లు దేశానికి అవసరమైనవేనని పలువురు భావిస్తున్నారు.

ఇక ఖర్చు విషయానికి వస్తే, కొన్ని ఖర్చులు జీవితంలో తప్పనిసరైనవే.  పెళ్ళి చేసుకోవటం ఖర్చుతో కూడుకున్నదే, ఆ తర్వాత సంసారం, పిల్లలు, వాళ్ళకి చదువు సంధ్యలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా ఖర్చుని పెంచేవే కానీ జీవితంలో అత్యంత అవసరమైనవే.  అలాగే ప్రపంచస్థాయిలో భారత దేశాన్ని సాంకేతికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టటానికి చేసే ఈ ఖర్చు కూడా డిఫెంస్ ఖర్చు లాంటిదే.  రోజూ యుద్దం జరగదు కానీ యుద్ధానికి సన్నద్ధులమై ఉండటం కోసం ఖర్చు పెట్టక తప్పదు.  అదేవిధంగా పరిశోధనలు కూడా ఖర్చుతో కూడుకున్నవే అయినా అవి దేశపురోగతి దృష్ట్యా అవసరమైనవేనన్న అభిప్రాయంలో ఉన్నారు ఆర్థిక శాస్త్ర విశ్లేషకులు కూడా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles