Amit shah elected as bjp president

Amit Shah, BJP Chief, Narendra Modi, Rajnath Singh, Sohrabuddin Encounter

Amit Shah, a close associate of Prime Minister Narendra Modi, will be the new BJP president, said Rajnath Singh, who is the current party chief.

సన్నిహితులకే పట్టం కడుతున్న మోడీ

Posted: 07/09/2014 01:05 PM IST
Amit shah elected as bjp president

నరేంద్ర మోడీ నిస్వార్థ పరుడు అని అనుకున్న వారికి ఆయన తీరు చూస్తుంటే కచ్చితంగా స్వార్థపరుడు అనే సందేహం కలుగుతుంది. ప్రధానిగా అధికారాలు చేపట్టిన తరువాత తనకు అత్యంత సన్నిహితులు, స్నేహితులకే కీలక అధికారాలు కట్టబెడుతున్నాడు. మొన్నటికి మొన్న తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఆనంది బెన్ పటేల్ కి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టిన ఆయన ఇప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అమిత్ షాకు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిని కట్టబెట్టి మరోసారి స్వార్థాన్ని ప్రదర్శించాడు.

గత కొన్ని రోజుల నుండి పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాకు కట్టబెడతారని వార్తలు వచ్చాయి. నేడు జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈయన పేరును ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా షాకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహన్ జోసి, నితిన్ గడ్కరీ పలువురు అబినందనలు తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనదైన కృషి చేసిన షాకి తగిన గౌరవం దక్కిందని బీజేపీ నాయకులు అంటున్నారు. గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles