Middle class people questiong pawan kalyan

middle class people questiong pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan news, pawan kalyan question to narendra modi, pawan kalyan news, middle class people questiong pawan kalyan, pawan kalyan question news

middle class people questiong pawan kalyan

పవన్.. ఇదేనా నీ ప్రశ్నకు సమాధానాలు!

Posted: 07/09/2014 10:36 AM IST
Middle class people questiong pawan kalyan

(Image source from: middle class people questiong pawan kalyan)

‘‘కాంగ్రెస్ కో హటావ్.. దేశ్ కో బచావ్’’ అంటూ నినాదాలు చేస్తూ.. మోదీ తరఫున ప్రచారం చేసిన పవన్ స్టార్ పవన్ కల్యాణ్... ఇప్పుడు ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఎలా స్పందిస్తారోనని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ‘‘మోదీ అధికారంలోకి వస్తే దేశం సస్యశ్యామలం అవుతుంది. పేదల బాధలు తీరిపోతాయి. సామాన్యుడు తన జీవితాన్ని సుఖంగా గడపవచ్చు’’ అని వాగ్దానాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే!

కానీ ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మొత్తం రివర్స్ గా మారిపోయింది. పవన్ కల్యాణ్ ఏ విధంగా అయితే మోదీకి అనుగుణంగా ప్రచారాలు చేశారో... దానికి భిన్నంగా ఆ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జనానికి అనుకూలంగా కాకుండా.. ప్రభుత్వం తమకు తాము లబ్ధిపొందాలనే ధోరణితో వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. టెక్నాలజీ పేరును అడ్డం పెట్టుకుని పేద ప్రజల కడుపు కొడుతున్నారని ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు.

ఈ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ప్రజలందరూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కేంద్రంలో వున్న ప్రభుత్వాలు సరియైన నిర్ణయాలు తీసుకోకపోతే సామాన్యప్రజల తరఫున వారిని ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్... ఇప్పుడు ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎందుకు ప్రశ్నించడం లేదని అందరూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారు’’ అని చెప్పిన పవన్... దేశ అభివృద్ధి అంటే పేదప్రజల కడుపులు కొట్టడమా..? అని ఆయనకి ఎదురుప్రశ్నలు వేయడం మొదలుపెట్టేశారు.

సామాన్యప్రజలకు ఏ అన్యాయం జరిగినా తాను ముందుండి ప్రశ్నిస్తానని చెప్పిన పవర్ స్టార్... ఇంత ఘోరం జరుగుతున్నా తాను ఎందుకు నోరెత్తడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ధరల పెంపకంపై నిర్ణయం తీసుకుంటున్న సమయంలో ప్రశ్నించలేకపోయిన పవన్... సామాన్యుల జీవితాలకు అండగా ఎలా వుంటారని ఆయనను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ‘‘పవన్.. ఇదేనా మీ ప్రశ్నకు సమాధానాలు’’ అంటూ తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రజలు ఆశించేవిధంగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా..? లేదా..? ధరల పెరుగుదలను తగ్గిస్తారా..? లేదా..? సామాన్యుడికి అండగా నిలుస్తానని మాటిచ్చిన ఆయన... తన మాటను నిలబెట్టుకుంటారా..? లేదా..? అని ఓటర్లు మొరపెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్య మానవులు... పవన్ కల్యాణ్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా కోరుతున్నారు. తమకు కేంద్రం నుంచి న్యాయం కల్పించే బాధ్యత ఆయనదేనని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా..? సామాన్య మానవులకు న్యాయం జరిగేలా చేస్తారా..? కేంద్రం పెంచిన ధరల్ని ఆయన తగ్గించగలరా..? అని ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles