Telangana bill tabled in ap assembly

telangana bill, t-bill tabled in assembly, speaker nadendla manohar, telangana bill announced, t-bill tabled in apassembly, tdp mlas burn telangana bill, telangana issue, ap reorganisation bill, political news, latest telugu news, breaking news, headlines

Telangana Bill tabled in AP Assembly

అసెంబ్లీలో విభజన బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్

Posted: 12/16/2013 11:42 AM IST
Telangana bill tabled in ap assembly

విపక్ష సభ్యుల నిరసనల మధ్య అసెంబ్లీ మరోసారి అరగంటపాటు వాయిదా పడింది. అంతకు ముందు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013ను సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ కార్యదర్శి సదారాం బిల్లులోని అంశాలను చదివి వినిపించారు.

  

శాసనసభ వెబ్ సైట్ లో బిల్లు ప్రతిని ఉంచామని, తెలుగు, ఉర్దూ అనువాద ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. 65 పేజీలు, 13 షెడ్యూల్ తో ఆంద్రపేదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును స్పీకర్ సభలో ప్రవేశపెట్టారు. మొదటి షెడ్యూల్ లో రాజ్యసభ సబ్యులు వివరాలు, రెండో షెడ్యూల్ లో శాసనసభ , లోక్ సభ నియోజక వర్గాల పునర్ విభజన వివరాలు , మూడో షెడ్యూల్ లో శాసనమండలి స్థానాలు వివరాలు, నాలుగో షెడ్యూల్ లో శాసన మండలి సభ్యుల విభజన , ఐదో షెడ్యూల్ లో తెలంగాణ రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు , ఆరో షెడ్యూల్ లో తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు , ఏడో షెడ్యూల్ లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్ లో ఫించ్లన వివరాలు , 9 వ షెడ్యూల్ లో ప్రభుత్వ రంగ సంస్థలు , కార్పోరేషన్ల వివరాలు , 10వ షెడ్యూల్ లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధింన వివరాలు, 11వ షెడ్యూల్ లో నదీజాల నిర్వహణ బోర్డుల విది విధానాలు, 12వ షెడ్యూల్ లో బొగ్గు, విద్యుత్ విధివిధానాలు, 13వ షెడ్యూల్ లో విద్య మౌలిక సదుపాయాల గురించి వివరించారు.

 

ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమ నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. దాంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. ఇక శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో మండలి ఛైర్మన్ చక్రపాణి సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles