Uttarakhand floods death toll over 550

Uttarakhand, Uttarakhand floods, Kedarnath, Flood, Sushilkumar Shinde

uttarakhand Chief Minister Vijay Bahuguna saying that nearly 600 people have been killed in the flood devastation, Home Minister Sushilkumar Shinde will be visiting the state on Saturday.

వరద ప్రాంతాల్లో నేడు షిండే పర్యటన

Posted: 06/22/2013 09:51 AM IST
Uttarakhand floods death toll over 550

ప్రకృతి కన్నెర్ర జేసింది. హిమాలయ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాల్లో జరిగిన ఈ పెను విలయ ధాటికి దాదాపు ఇప్పటి వరకు 550 మందికి పైగానే మరణించిన వారి మృతదేహాలు బయట పడ్డాయి. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ విలయానికి ఎన్నో వేల మంది విలవిల్లాడి పోయారు. విహార యాత్ర చేద్దామని అనుకున్న వారికి అదే చివరి యాత్రగా మిగిలిపోయింది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నిన్నటి సహాయ చర్యల్లో బాగంగా 40 మృతదేహాలను సిబ్బంది బయటికి తీశారు. ఈ విపత్తులో ఇప్పటి వరకు 556 మంది మరణించిన వారి ఇంకా వందలాది మంది కొండచరియలు, మట్టిదిబ్బల్లో చిక్కుకుని చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ తెలిపారు. ఒక్క కేదార్‌నాథ్‌లోనే ఐదు వేల మంది గల్లంతయ్యారని.. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారని స్వచ్ఛంద సేవా సంస్థ యాక్షన్ ఎయిడ్ పేర్కొంది.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 34 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.

షిండే శనివారం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని యాత్రికులందరినీ రెండు రోజుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, సహాయక చర్యలు శనివారంనాటికి పూర్తవుతాయని ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) చీఫ్ అజయ్ చద్దా చెప్పారు. వాతావరణం మెరుగు కావడంతో సహాయక చర్యలు ముమ్మరమైనట్లు ఆయన తెలిపారు. బద్రీనాథ్‌కు బ్రిడ్జి కనెక్టివిటీని ఏరపాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎగువన పర్వత ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియల కింద మట్టి దిబ్బల్లో చిక్కుకుని ఇంకా ఎంతో మంది మరణించి ఉంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  మొత్తానికి అక్కడ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles