Telangana leaders vs samaikya andhra leaders

telangana issue, congress party, telangana package, telangana state, samaikya andra, telangana leaders vs samaikya andhra leaders, sonia gandhi, kcr, ganta srinivasa rao, jana reddy, andhrapradesh, breaking news, ap politics, political news, andhra news

telangana leaders vs samaikya andhra leaders

మొదలైన తెలంగాణ- సమైక్య వేడి..?

Posted: 06/21/2013 01:36 PM IST
Telangana leaders vs samaikya andhra leaders

రాష్ట్రంలో తెలంగాణ- సమైక్య వేడి మొదలైంది. కేంద్రం నుండి ప్రకటన రాకముందే తెలంగాణకు ప్యాకేజీ అనే వార్తలు రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో రెండు ప్రాంతాల నాయకుల మద్య వేడి వాతావరణం నెలకొంది. రెండు ప్రాంతాల నాయకులు అలర్డ్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం నుంచి ఏదో ఒక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా రేపు మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర విభజన ప్రకటన వస్తే ఎలా వ్యవహరించాలి..? ప్యాకేజీ ఇస్తే ఎలా స్పందించాలన్న అంశంపై రేపటి భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 30న తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్న బహిరంగ సభపైనా చర్చ చేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ముందుకు కాంగ్రెస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత అవసరమైతే అన్ని పార్టీలతోనూ భేటీ అవుతామని మంత్రి గంటా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మరోసారి తెలంగాణ, సమైక్య వేడి మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles