Political government chief vip gandra venkataramanareddy comments on liquor sales

vip gandra venkataramana reddy, government chief vip gandra venkataramana reddy, comments on liquor sales, liquor belt shops, cm kiran kumar reddy, minister jairam ramesh,

government chief vip gandra venkataramana reddy comments on liquor sales

మద్యం నిలిపేస్తే ఆరోగ్యం చెడిపోతుంది: గండ్ర

Posted: 05/07/2013 11:00 AM IST
Political government chief vip gandra venkataramanareddy comments on liquor sales

కేంద్ర మంత్రి జైరాం రమేష్ కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మహిళలకు వరాలు కురిపించారు. ముఖ్యంగా మహిళలు మద్యాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రిని కోరగా .. ఆయన వెంటనే జైరాం రమేష్ ఆద్వర్యంలో .. త్వరలో రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులు తొలగిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే అంచలెంచలుగా బెల్టు షాపులు తొలగిస్తామని సీఎం మహిళలకు హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. గత 60 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్ ఉందని, అయితే, మద్యాన్ని ఒకేసారి నిషేధిస్తే దానికి అలవాటు పడిన వారికి ఆరోగ్య సమస్యలొస్తాయని చెప్పారు.

రాష్ట్రంలో మద్యంపై నిషేధాన్ని వెంటనే అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉద్ఘాటించారు. అదేవిధంగా రాష్ట్రంలోని బెల్టుషాపులను ఒకేసారి నిర్మూలించడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ‘బెల్టుషాపులను ఒకేసారి తగ్గించలేం. దీనివల్ల సమస్యలొస్తాయి. సీఎం ప్రవేశ పెట్టిన కొత్త మద్యం పాలసీ ఈ బెల్టుషాపులను ఎత్తివేయడానికి ఉపయోగపడుతుంది’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles