Indian love marriage couples

indian love marriage couples, Village People, Love couples,

indian love marriage couples

indian0000.gif

Posted: 06/12/2012 12:31 PM IST
Indian love marriage couples

indian love marriage couples

ప్రేమ అనేది ఎలా ఫుట్టిందో తెలియదు గానీ ..  ప్రేమ పుట్టిన చోట మాత్రం గొడవలు పుడతాయాని మాత్రం తెలుసు.  కానీ ఒక గ్రామస్థులు మాత్రం ప్రేమంటే వారి చాలా ఇష్టమని చెబుతున్నారు.  ప్రేమ కోసం వారు ఏమైన చేస్తారట.  ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు వారు హరతి ఇస్తారట.ప్రేమించి పెళ్లి చేసుకునే వారిని ఆ గ్రామస్థులు మనసారా స్వాగతిస్తారు.. ఆప్యాయతతో అక్కున చేర్చుకుంటారు.. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై శూలగిరి సమీపంలోని మరండపల్లి గ్రామం ప్రేమజంటలకు ఆశ్రయం ఇస్తూ వార్తల్లోకెక్కింది. తమ గ్రామంలో ప్రేమపెళ్లిళ్లు అత్యంత సహజమని, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ప్రతి ఇంట్లో కనీసం ఒకటైనా ఉంటుందని ఆ గ్రామ సర్పంచ్ ఇ.ప్రకాశం గర్వంగా చెబుతున్నారు. ఈ పంచాయితీలో 150 ఇళ్లు ఉండగా, జనాభా 700కు మించి లేదు.

ప్రేమలో పడ్డ యువతీ యువకులకు సమస్యలు ఎదురైతే గ్రామస్థులకు నిర్భయంగా చెప్పుకోవచ్చు. ప్రేమికులను దాంపత్య బంధంతో ఏకం చేసేందుకు గ్రామస్థులంతా ఉమ్మడిగా ఆలోచిస్తారు. గ్రామపెద్ద సమక్షంలో ప్రేమికులను, వారి కుటుంబ సభ్యులను సమావేశ పరుస్తారు. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆటంకాలున్నా వీరే పరిష్కరిస్తారు. తమ గ్రామానికి చెందిన ప్రేమికులైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఇతర ప్రాంతాల వారైనప్పటికీ తాము జోక్యం చేసుకుని పరిష్కార మార్గాన్ని కనుగొంటామని గ్రామపెద్ద కె.కన్నప్ప (70) అంటున్నారు. కొనే్నళ్ల క్రితం పొరుగునే ఉన్న తోడూర్‌కు చెందిన ఓ యువతి మరండపల్లికి చెందిన యువకుడికి ప్రేమించింది. వీరి వివాహానికి మొదట అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ ప్రేమికురాలు కన్నప్పను ఆశ్రయించింది. మరండపల్లి గ్రామస్థులు పరిస్థితులను చక్కదిద్ది ప్రేమజంటకు పెద్దల అంగీకారంతో వివాహం జరిపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతికి ఇద్దరు పిల్లలు కలిగారు. భవిష్యత్‌లో తమ పిల్లలు ప్రేమలో పడినా వారి పెళ్లిళ్లకు అడ్డుచెప్పేది లేదని ఆమె అంటోంది. కాగా, ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువతులకు మరండపల్లి గ్రామస్థులు పూర్తి భద్రత కల్పిస్తున్నారు. తాము ఎన్నో ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేయగా, ఇంతవరకూ ఎవరూ విడాకుల కోసం అడగలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఏ ఇంట్లోనైనా భర్త మరణిస్తే, అతని భార్యకు ఆస్తిలో వాటా ఇప్పించడంలోనూ గ్రామస్థులు సఫలీకృతమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla dharmana krishna das supports to ys jagan
Bhanwar lal worked as jagan agent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles