Gandra venkata ramana reddy

gandra venkata ramana reddy,Gandra Venkata Ramana Reddy, Photos - Gandra Venkata Ramana Reddy, Videos - Gandra Venkata Ramana Reddy.Gandra Venkata Ramana,Government Chief Whip Gandra Venkata Ramana Reddy

gandra venkata ramana reddy

gandra.gif

Posted: 05/05/2012 11:01 AM IST
Gandra venkata ramana reddy

gandra venkata ramana reddy

‘రాజకీయాల్లో నేను ఏకలవ్యుడిని, నాకు రాజకీయ గురువు ఎవరూ లేరు..’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమ్మారావు తన స్థాయి ఏమిటో తెలుసుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన విలేఖరుల సమావేశంలో హెచ్చరికగా తెలిపారు. గండ్రకు తానే రాజకీయ గురువునని సమ్మారావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

తనకు రాజకీయ గురువు ఎవరూ లేరని ఆయన చెప్పారు. తాను స్వతహాగా, క్రమశిక్షణతో ఎదిగానని అన్నారు. సమ్మారావు చేరిక గురించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడినైన తనకు తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పదవీ బాధ్యతల స్వీకారోత్సవానికి తాను హాజరయ్యానని, అక్కడ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తాను పలుకరించినప్పుడు సమ్మారావు చేరిక గురించి చెప్పి, చేరిక కార్యక్రమానికి రావాలని చెప్పారని ఆయన తెలిపారు. రాజ్‌భవన్‌లో తాను బొత్సను పలుకరించినందుకే సమాచారం తెలిసిందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడినైన తనకు తెలియకుండా గ్రామ, మండల స్థాయిల్లోనూ ఇలా జరిగితే బాగుంటుందా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. పిసిసి స్థాయిలో చేరికలు జరిగినప్పుడు డిసిసి అధ్యక్షునికి తెలియాల్సిన అవసరం లేదని ‘పెద్దలు’ భావిస్తే, తాను తప్పుపట్టనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dubai dreams big with underwater discus hotel
Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles