Sourav ganguly

Sourav Ganguly, kolakatta, Pune Warriors,Indian cricketer, and captain of the Indian national teamnKolkata

Sourav Ganguly

Sourav.gif

Posted: 05/05/2012 10:44 AM IST
Sourav ganguly

Sourav Ganguly

తమ ఆటగాళ్లను అడుగడుగునా ఉత్సాహపరుస్తూ జైకొడతారు. ఏ ప్రాంతానికి చెందిన అభిమానులైనా స్థానిక జట్లకు మద్దతిస్తారు. కానీ కోల్‌కతా క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి మద్దతు పలకాలో, ఎవరికి జైకొట్టాలో తెలియని సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా పుణే వారియర్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడుతుంది. సాధారణ పరిస్థితుల్లో అభిమానులంతా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మద్దతివ్వాలి.

పుణే వారియర్స్ క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరించాలి. కానీ, తాము అమితంగా అభిమానించే ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ ఇప్పుడు పుణే జట్టుకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఎవరికి మద్దతు పలకాలో తెలియని స్థితి అభిమానులది. కోల్‌కతాకు జై అంటే తమ అభిమాన ఆటగాడు గంగూలీని కాదన్నట్టే. ఒకవేళ గంగూలీని సమర్థిస్తే స్థానిక జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను అవమానించినట్టే. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్నది కోల్‌కతా అభిమానులకు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇలావుంటే, గతంలో మూడు ఐపిఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన గంగూలీ నాలుగో ఐపిఎల్‌లోనే పుణేకు తరలి వెళ్లాడు. ఇప్పుడు ఆ జట్టు తరఫునే తన సొంత గడ్డపై,

తన మాజీ జట్టుతోనే యుద్ధానికి కత్తులు దూస్తున్నాడు. దీనితో అతని పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగాల్ జట్టులో, కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మ్యాచ్‌లు ఆడిన అతను అదే స్టేడియంలో, ఒకప్పటి తన జట్టుకు తానే శత్రు శిబిరం నాయకుడిగా మైదానంలోకి దిగనున్నాడు. ఈ చిత్రమైన పరిస్థితి అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp yemmiganur assembly segment candidate bv mohan reddy
Political parties in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles